Advertisementt

డిస్పాయింట్ అవుతున్న ప్రభాస్ ఫాన్స్

Wed 05th Apr 2023 04:16 PM
prabhas fans!  డిస్పాయింట్ అవుతున్న ప్రభాస్ ఫాన్స్
Prabhas Fans In Utter Disappointment డిస్పాయింట్ అవుతున్న ప్రభాస్ ఫాన్స్
Advertisement
Ads by CJ

ప్రభాస్-హ్రితిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. వార్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో.. ఆల్మోస్ట్ ప్రభాస్-హ్రితిక్ రోషన్ కాంబో ఫిక్స్ అయ్యింది. అది కూడా మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాణంలోనే జరగబోతుంది.. అందుకే మైత్రి వారు పఠాన్ తో సక్సెస్ కొట్టిన సిద్దార్థ్ ని ముంబై వెళ్లి మరీ అభినందించి వచ్చారంటూ న్యూస్ లు మీడియాలో చక్కర్లు కొట్టడంతో ప్రభాస్ ఫాన్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీలయ్యారు. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో బాలీవుడ్ స్టార్ హీరో హ్రితిక్ రోషన్ అంటే బాక్సాఫీసు షేక్ అంటూ ప్రభాస్ ఫాన్స్ చాలా ముచ్చటపడ్డారు. ఈ మధ్యన హ్రితిక్ రోషన్, ప్రభాస్ కలిసి నటించడం లేదనే న్యూస్ వినిపించింది. కానీ ఈ రోజు ఉదయం నుండి ప్రభాస్ ఫాన్స్ చాలా అంటే చాలా డిస్పాయింట్ అవుతున్నారు. కారణం హ్రితిక్ రోషన్ మరో టాలీవుడ్ స్టార్ హీరోతో జతకడుతున్నాడన్న విషయం తెలిసి వారు తెగ ఇదైపోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో స్టార్ హీరో హ్రితిక్ రోషన్ మూవీ కన్ ఫర్మ్ అయ్యింది.. అది కూడా బ్రహ్మాస్త్ర దర్శకుడు ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 అఫీషియల్ గా ప్రకటించడంతో ప్రభాస్ ఫాన్స్ ఫీలైపోతున్నారు.

ప్రభాస్ తో హ్రితిక్ నటిస్తే బాక్సాఫీసు షేక్ అయ్యేది.. ఇప్పుడా ఛాన్స్ ఎన్టీఆర్ కొట్టేశాడని వాళ్ళ ఫీలింగ్. అది వార్ 2 తోనే ఎన్టీఆర్-హ్రితిక్ రోషన్ జత కట్టడంతో.. ప్రభాస్ ఆ ఛాన్స్ మిస్ అయ్యాడు అని వారు బాగా డిస్పాయింట్ అవుతున్నారు. మరి ఫ్యూచర్ లో ప్రభాస్-హ్రితిక్ ప్రాజెక్ట్ ఉంటుందో.. లేదో.. అనేది వాళ్ళ టెన్షన్ కి అసలు కారణం.

Prabhas Fans In Utter Disappointment:

Disappointment For Prabhas Fans!

Tags:   PRABHAS FANS!
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ