Advertisementt

ఫైనల్లీ ఉస్తాద్ గా మారిన పవన్ కళ్యాణ్

Wed 05th Apr 2023 03:40 PM
pawan kalyan,harish shankar  ఫైనల్లీ ఉస్తాద్ గా మారిన పవన్ కళ్యాణ్
Ustaad Bhagat Singh Starts Shoot ఫైనల్లీ ఉస్తాద్ గా మారిన పవన్ కళ్యాణ్
Advertisement
Ads by CJ

ఎప్పుడో పవన్ కళ్యాణ్ తో ప్రకటించిన తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఎట్టకేలకి గత ఏడాది డిసెంబర్ లో పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టాడు హరీష్ శంకర్. హరీష్ తో సినిమా ఓకె అయ్యాక పవన్ కళ్యాణ్ ముందుగా భీమ్లా నాయక్ పూర్తి చేసారు. తర్వాత సాయి తేజ్-సముద్ర ఖని మూవీ కంప్లీట్ చేసారు. మధ్యలో క్రిష్ హరి హర వీరమల్లు చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోకి ముందుగా టైటిల్ భవదీయుడు భగత్ సింగ్ అని పెట్టిన హరీష్ పూజా కార్యక్రమాలు చేసేసరికి టైటిల్ మార్చేశాడు.

ఉస్తాద్ భగత్ సింగ్ గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ కేరెక్టర్ ని డిజైన్ చేసాడు(కాదు తేరి లో విజయ్ కేరెక్టర్ లో పవన్ చూయించబోతున్నాడు) అని అంటున్నారు. ఇక డిసెంబర్ లో పూజా కార్యక్రమాలను ముగించుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళుతుందో అని పవన్ ఫాన్స్ కన్నా ఎక్కుగా హరీష్ ఎదురు చూసాడు. ఫైనల్లీ నేడు ఏప్రిల్ 5 నుండి సెట్స్ మీదకెళ్లింది. ఇవాళ్టి నుంచి షూట్ స్టార్ట్ అవ్వడంతో పవన్ అభిమానులు హ్యాపీ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు. గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ అవుతుంది.. ఈసారి పక్కా ఇండస్ట్రీ హిట్ అంటూ వాళ్ళు గాల్లో తేలిపోతున్నారు.

హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఉస్తాద్ భగత్ సింగ్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా.. అందులో ఒక హీరోయిన్ గా శ్రీలీలని ఎంపిక చేసిన హారిష్ శంకర్ మరో హీరోయిన్ విషయంలో ఇంకా తర్జన భర్జన పడుతున్నాడట. ఆయనకి పూజ హెగ్డే మీదే గురి ఉంది.. కానీ ప్రస్తుతం ఆమె డల్ మోడ్ లో ఉండడమే హారిష్ ఆలోచనకి కారణంగా తెలుస్తుంది

Ustaad Bhagat Singh Starts Shoot :

Pawan Kalyan - Harish Shankar Ustaad Bhagat Singh Starts Shoot 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ