ట్విట్టర్ అనగానే గుర్తొచ్చేది ట్విట్టర్ పిట్ట. కానీ ఇప్పుడు ఆ పిట్ట స్థానంలోకి కుక్కపిల్ల వచ్చి చేరింది. కుక్కపిల్ల బాగానే ఉంది.. కానీ ట్విట్టర్ పిట్ట కనిపించకపోతే ఏదో బాగోలేదు అనే ఫీలింగ్. ట్విట్టర్ ఓపెన్ చెయ్యగానే ట్విట్టర్ పిట్టకి బదులు బొచ్చు కుక్కపిల్ల.. అది చూసే నెటిజెన్స్ కి నచ్చలేదు అనేది. ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చాక ఎన్నో మార్పులు చేర్పులు ఇవన్నీ ఓకె.
ఒక్క ట్విట్టర్ పిట్టని మార్చడమే బొత్తిగా డైజెస్ట్ కావడం లేదు. బ్లూ కలర్ లో ట్విట్టర్ పిట్ట.. అది ట్విట్టర్ కే అందాన్ని తీసుకువచ్చింది. కానీ ఇప్పుడా కుక్కపిల్ల బొత్తిగా నచ్చడమే లేదు. అయినా ఎలాన్ మస్క్ ఇష్టం. ఆయన ట్విట్టర్ లోగోని ఆయన మార్చుకునే అధికారం ఉంది. కానీ ట్విట్టర్ వాడే ప్రతి ఒక్కరూ ట్విట్టర్ పిట్ట గురించి తెగ బాధపడిపోతున్నారు. అది లేని వెలితిని ఫీలవుతున్నారు.
బొచ్చు కుక్కపిల్ల వచ్చి ఒక్కరోజు గడిచిపోయింది. కుక్కపిల్లకి మెల్లగా అలవాటు పడినా.. పిట్ట కోసం ఎదురు చూసే వారు లేకపోలేదు. ఈ విషయంలో ఎలాన్ మస్క్ ఒక్కసారి ఆలోచిస్తే బావుంటుంది.