Advertisementt

హృతిక్ - ఎన్టీఆర్ వాట్ ఏ కాంబో.!

Wed 05th Apr 2023 11:28 AM
jr ntr,hrithik roshan  హృతిక్ - ఎన్టీఆర్ వాట్ ఏ కాంబో.!
NTR-Hrithik what a combo హృతిక్ - ఎన్టీఆర్ వాట్ ఏ కాంబో.!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ హీరో టాలీవుడ్ హీరో తో కలిసి బిగ్ బడ్జెట్ మూవీ చెయ్యడం ఇదే మొదటిసారేమో.. ఇప్పటివరకు నాగ చైతన్య అమీర్ సినిమాలో గెస్ట్ రోల్ చేసాడు. మెగాస్టార్ కోసం సల్మాన్ గెస్ట్ రోల్ చేసారు. ఇప్పుడు చరణ్ సల్మాన్ మూవీలో ఓ సాంగ్ లో మెరుస్తున్నాడు. కానీ ఓ టాలీవుడ్ స్టార్ హీరో-బాలీవుడ్ స్టార్ హీరో కలిసి సినిమా చెయ్యడం.. అది కూడా క్రేజీ బాలీవుడ్ దర్శకుడి దర్శకత్వంలో. ఎవ్వరూ ఊహించనిది, అసలు ఊహకి కూడా అందనిది. అదే జరిగింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్-బాలీవుడ్ స్టార్ హీరో హ్రితిక్ రోషన్ కాంబోలో ఓ మూవీ. అబ్బ వాట్ ఏ కాంబో అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ అస్సలు ఆగడం లేదు. బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ-హ్రితిక్ రోషన్ కలయికలో వార్ 2 అనౌన్స్ మెంట్ నిన్న మంగళవారమే వచ్చింది. అది వచ్చిన 24 గంటల్లో హ్రితిక్ రోషన్-ఎన్టీఆర్ కాంబోలో వార్ 2 అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో సినిమా అనౌన్సమెంట్ రావడం అబ్బో ఈ క్రేజీ కాంబినేషన్ ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్-హ్రితిక్ కాంబోలో భారీ యాక్షన్ థ్రిల్లర్ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లుగా అఫీషియల్ అనౌన్సమెంట్ రావడంతో సోషల్ మీడియాలో మొత్తం అదే న్యూస్ తో షేకైపోతుంది. 

NTR-Hrithik what a combo:

Jr NTR and Hrithik Roshan On Board For War 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ