Advertisementt

శ్రీవల్లి మరింత అందంగా మారిందే.!

Wed 05th Apr 2023 10:46 AM
pushpa the rule,rashmika  శ్రీవల్లి మరింత అందంగా మారిందే.!
Pushpa The Rule wishes the Srivalli శ్రీవల్లి మరింత అందంగా మారిందే.!
Advertisement
Ads by CJ

రష్మిక మందన్న పుష్ప చిత్రంలో డీ గ్లామర్ గా గా శ్రీవల్లి కేరెక్టర్ లో కనిపించింది. ఆ చిత్రం పాన్ ఇండియా మార్కెట్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. పాన్ ఇండియా సక్సెస్ తో రష్మిక ఊపు పెరిగిపోయింది. బాలీవుడ్ లో వరస ప్రాజెక్ట్స్ తో కళకళలాడింది. సౌత్ లో బ్యాక్ బ్యాక్ రెండు సినిమాలు స్టార్ట్ చేసింది. అయితే రశ్మికని శ్రీవల్లి గా మరీ మడ్డి అమ్మాయిలా సుకుమార్ ప్రెజెంట్ చేసారు. కథా నేపథ్యం ఎలా ఉన్నా.. ఆమె పాత్ర ఎలా ఉన్నా రష్మిక రూపాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. లంగా వోణి, చీరల్లో రష్మిక పుష్ప లో కనిపించింది.

ఈరోజు శ్రీవల్లి రష్మిక మందన్న పుట్టిన రోజు సందర్భంగా పుష్ప ద రూల్ నుండి ఆమె లుక్ వదిలింది టీం. ఈసారి శ్రీవల్లిని కాస్త అందంగా చూపించారు. మేకప్ లేకపోయినా.. రష్మిక మొహం కళగా కనిపించింది. పుష్ప ద రైజ్ లో మొహమంతా ఆయిల్ రాసినట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఈ లుక్ లో శ్రీవల్లి కొద్దిగా కళగా, ఫ్రెష్ గా కనిపించింది. పుష్ప ద రూల్ నుండి రష్మిక లుక్ ఇచ్చిన మరికొద్ది క్షణాల్లో పుష్ప నుండి బిగ్గెస్ట్ అప్ డేట్ రాబోతుంది.

అది అల్లు అర్జున్ బర్త్ డే కి సంబందించిన అప్ డేట్. పుష్ప ద రూల్ షూటింగ్ డిసెంబర్ లోనే మొదలయ్యింది. ఫహద్ ఫాసిల్-అల్లు అర్జున్ లపై కీలక సన్నివేశాలను సుకుమార్ చిత్రీకరిస్తున్నారు. రీసెంట్ గానే రష్మిక పుష్ప ద రూల్ సెట్స్ లో జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది.

Pushpa The Rule wishes the Srivalli:

Pushpa The Rule wishes the gorgeous Srivalli aka Rashmika a very Happy Birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ