ప్రస్తుతం త్రివిక్రమ్-మహేష్ కాంబోలో క్రేజీ హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న SSMB 28 షూటింగ్ హైదరాబాద్ లోనే వేసిన ఓ భారీ సెట్ లో ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. హీరోయిన్స్ శ్రీలీల, పూజ హెగ్డే ఎప్పుడెప్పుడు మహేష్ SSMB28 సెట్స్ లోకి అడుగుపెడదామా అని ఎదురు చూస్తుంటే.. ఈ షెడ్యూల్ ఫినిష్ చేసి ఎప్పుడెప్పుడు బ్రేక్ ఇచ్చేసి ఫారిన్ వెళ్లాలనే ఆలోచనలో మహేష్ ఉన్నారు. ఎందుకంటే గత పది రోజులుగా సితార-నమ్రతలు పారిస్ ట్రిప్ లో ఉన్నారు. SSMB28 షూటింగ్ వలన మహేష్ వాళ్లతో వెల్లేకపోయారు.
ఇక సితార సెలవలు రావడంతో నమ్రతనే సితారని తీసుకుని పారిస్ కి వెళ్ళింది. అక్కడ తన సిస్టర్, అలాగే వాళ్ళ పాపతో కలిసి వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు SSMB28 షూట్ కి కొద్దిగా బ్రేకిచ్చి ఈనెల 6 న ఫ్లైట్ ఎక్కుతారట. మహేష్ ఓ 15 డేస్ భార్య నమ్రత, కూతురు సితార తో జాయిన్ అవ్వబోతున్నారట. గౌతమ్ ఎగ్జామ్స్ కూడా పూర్తి కావడంతో గౌతమ్ అండ్ మహేష్ ఇద్దరూ కలిసి పారిస్ కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది.
అక్కడే ఓ 15 డేస్ ఎంజాయ్ చేసి హైదరాబాద్ కి వస్తారని.. తర్వాతే త్రివిక్రమ్ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. ఎలాగూ ఈ చిత్రం ఆగష్టు లో విడుదల కావడం లేదు. నెక్స్ట్ ఇయర్ జనవరికి పోస్ట్ పోన్ అవడంతో మహేష్ కూడా రిలాక్స్ అవుతున్నట్లుగా తెలుస్తుంది.