Advertisementt

పండంటి బిడ్డకి జన్మనిచ్చిన పూర్ణ

Tue 04th Apr 2023 04:15 PM
actress poorna  పండంటి బిడ్డకి జన్మనిచ్చిన పూర్ణ
Actress Poorna Blessed With A Baby Boy పండంటి బిడ్డకి జన్మనిచ్చిన పూర్ణ
Advertisement
Ads by CJ

నటి పూర్ణ ప్రస్తుతం షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చేసి.. తల్లయ్యే మధుర క్షణాలని ఆస్వాదిస్తోంది. గత ఏడాది దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త ఆసీఫ్ అలీని వివాహం చేసుకున్న పూర్ణ.. ఆమె పెళ్లి సీక్రెట్ గానే చేసుకున్నా.. తర్వాత ఆ పెళ్లి ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. పూర్ణ పెళ్లి అప్పుడు ఆమె ధరించిన నగలు, ఆమెకి అందిన బహుమతులు భర్త ఇచ్చిన గిఫ్ట్స్  అన్ని బాగా వైరల్ అయ్యాయి. పెళ్ళికి ముందు సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ చేస్తున్న పూర్ణ బుల్లితెర మీదా సందడి చేసేది.

పెళ్లి తర్వాత కూడా ఆమె తనకిష్టమైన నటనని వదల్లేదు. బుల్లితెర మీద డాన్స్ షోస్, స్పెషల్ టివి ప్రోగ్రామ్స్ లో కనిపించిన పూర్ణ ఏడాది తిరక్కుండానే తన ఫ్యామిలీకి గుడ్ న్యూస్ చెప్పింది. పూర్ణ.. తల్లవుతుంది అని తెలిసిన మరుక్షణమే ఆనందంతో తేలిపోయింది. ఆమెకి తన కుటుంబసభ్యులు సీమంతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ పిక్స్ ని పూర్ణ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది. తర్వాత బేబీ బంప్ ఫొటోస్ తో హడావిడి చేసింది. 

సోమవారం రాత్రి దుబాయ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బెడ్ పై బాబును ఎత్తుకొని హాస్పిటల్ సిబ్బందితో నటి పూర్ణ ఓ ఫోటోని తన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పూర్ణ డెలివరీ విషయం విన్న ఫాన్స్ ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Actress Poorna Blessed With A Baby Boy :

Actress Poorna husband welcome first child

Tags:   ACTRESS POORNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ