Advertisementt

సమంత స్లిప్పర్ షాట్ టు రూమర్స్

Tue 04th Apr 2023 12:22 PM
samantha,naga chaitanya  సమంత స్లిప్పర్ షాట్ టు రూమర్స్
Samantha indirect comments on Chaitu-Shobhita dating సమంత స్లిప్పర్ షాట్ టు రూమర్స్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య సమంతని ప్రేమించక ముందు అతనిపై ఎలాంటి లవ్ ఎఫ్ఫైర్స్ రూమర్స్ రాలేదు. అసలు సమంతని చైతూ ప్రేమిస్తున్న విషయం తెలిసి అందరూ షాకయ్యారు కూడా. సామ్-చై కొన్నేళ్లు ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని, నాలుగేళ్లు కలిసి కాపురం చేసాక మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అప్పటినుండి ఆలోచనలతో సతమతమవుతూనే పనిలో పడిపోయింది సమంత. చైతు కూడా తన పనిలో తాను ఉండగా.. ఈ మధ్యలో నాగ చైతన్య మరో హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో డేటింగ్ లో ఉన్నాడనే న్యూస్ పదే పదే మీడియాలో వినిపిస్తుంది. 

గతంలో వీరిద్దరూ వెకేషన్ కి వెళ్లారంటూ ఫొటోస్ వైరల్ చెయ్యగా.. ఇప్పుడు వారు లండన్ లో ఒకే హోటల్ లో ఉన్నారంటూ ఆధారాలతో సహా చూపించడం మరోసారి చర్చలకు దారి తీసింది. అయితే తన వైవాహిక జీవితంలో తాను కరెక్ట్ గా ఉన్నప్పటికీ అది నిలబడలేదని.. తన తప్పేమి లేదు అంటూ సమంత మరోవైపు సింపతీ కోసం పాకులాడుతుంది. సమంత సానుభూతి పరులు చైతూ-శోభిత వ్యవహారంపై ఫైర్ అవుతున్నారు.

అయితే సమంత తన స్నేహితుల దగ్గర చైతు-శోభిత డేటింగ్ పై రియాక్ట్ అయ్యిందని, వారి పేర్లు తియ్యకుండానే ఎవరు ఎవరితో డేటింగ్ లో ఉంటే నాకెందుకు, ఎవరు ఎలా పొతే నాకెందుకు అన్న రీతిలో ఆమె స్పందించినట్లుగా ఓ ప్రముఖ వెబ్ సైట్ లో వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సమంత ఈ న్యూసెన్స్ పై స్పందించింది.

ఆ వెబ్ సైట్ లో వచ్చిన కథనాన్ని టాగ్ చేస్తూ.. నేను దీన్ని ఎప్పుడూ చెప్పలేదు అంటూ సమంత చెప్పడంతో.. ఆ వెబ్ సైట్ వాళ్ళు కావాలనే సమంతని ఇబ్బంది పెట్టేలా ఆ న్యూస్ రాసారని అర్ధమవుతుంది అంటూ సదరు వెబ్ సైట్ పై నెటిజెన్స్, సామ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. 

Samantha indirect comments on Chaitu-Shobhita dating:

Samantha indirect reacts to rumours of Naga Chaitanya dating

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ