Advertisementt

కాజల్ అందాలు ఈ రేంజ్ లోనా..?

Mon 03rd Apr 2023 09:27 PM
kajal aggarwal  కాజల్ అందాలు ఈ రేంజ్ లోనా..?
Kajal beauty is in this range..? కాజల్ అందాలు ఈ రేంజ్ లోనా..?
Advertisement
Ads by CJ

కాజల్ ఎప్పుడూ అందగత్తె, గ్లామర్ డాలే. ఆ అందం, ఆ గ్లామర్ పెళ్లి తర్వాత అందులోనూ బిడ్డ పుట్టాక మాయమవుతుంది అనుకుంటే.. కాజల్ బిడ్డ పుట్టాక మరింత అందంగా ఆకర్షణగా తయారయ్యింది. బాబుకి జన్మనిచ్చాక కాజల్ కాస్త వెయిట్ పెరిగినా.. మళ్ళీ వర్కౌట్స్ చేసి దానిని కరిగించేసి ఇండియన్ 2 సెట్స్ లో వాలిపోయింది. ఇండియన్ 2 సెట్స్ లోకి వెళ్లేముందు కూడా కాజల్ కాస్త బొద్దుగానే ఉంది. కానీ ఇప్పుడు కాజల్ మళ్ళీ సన్నగా నాజూగ్గా తయారైంది. టూ మచ్ గ్లామర్ చూపిస్తుంది.

నిన్నగాక మొన్న రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో కాజల్ బుల్లి గౌనులో దర్శనమిచ్చింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి పరిచయమవుతున్న హీరోయిన్ మాదిరిగా కాజల్ అగర్వాల్ ఆ పార్టీలో సందడి చేసింది. ఇక ప్రస్తుతం బాలయ్య NBK108 సెట్స్ లో జాయిన్ అయిన కాజల్ రీసెంట్ గా ముంబై లో జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ కి వెళ్ళింది. అది కూడా భర్త గౌతమ్ తో కలిసి. అక్కడ బాలీవుడ్ హీరోయిన్స్ కి పోటీగా రెడీ అయ్యింది. 

అసలు కాజల్ అగర్వాల్ రెడీ అయిన తీరు చూస్తే నిజంగా మతి పోవాల్సిందే. ఈ రేంజ్ లో కాజల్ అందాలు ఆరబోసిందా అంటూ నోరెళ్ళ బెట్టడం ఖాయం. వైట్ మోడ్రెన్ డ్రెస్ లో కాజల్ మెస్మరైజ్ కాదు.. అందాలు ఎంతగా చూపించొచ్చో అంతగా చూపించేసింది. కాజల్ గ్లామర్ షో చూసి వామ్మో కాజల్ ని ఆపడం ఎవ్వరి తరమూ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పెళ్లయ్యాక కూడా కాజల్ ఊపు ఏమాత్రం తగ్గలేదు. 

Kajal beauty is in this range..?:

Kajal Aggarwal attends Ambani event with her husband

Tags:   KAJAL AGGARWAL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ