రాశి ఖన్నా బాలీవుడ్ కి వెళ్ళాక పూర్తిగా మారిపోలేదు. అంతకుముందు కూడా రాశి ఖన్నా గ్లామర్ గానే కనిపించేది. అవసరానికి మించి అందాలు ఆరబోసిన సందర్భాలూ లేకపోలేదు. టాలీవుడ్, కోలీవుడ్ లో బ్రేక్ ఇచ్చే సినిమాలు లేకపోయినా.. ప్రస్తుతం రాశి ఖన్నా రేంజ్ బాలీవుడ్ లో బాగా పెరిగింది. అక్కడి ఫార్జి వెబ్ సీరీస్ రాశి ఖన్నాకి అదృష్టాన్ని తీసుకువచ్చింది. ఫార్జి వెబ్ సీరీస్ వలన ఆమె క్రేజీ హిందీలో పెరిగి ఇప్పుడు ఆమె పేరు IMDb వరకు పెరిగిపోయింది.
అయితే హిందీలో నిలదొక్కుకోవాలంటే గ్లామర్ షో ని మరింత ఘాటుగా పరిచయం చెయ్యాలనే తపనతో రాశి ఖన్నా అందాల ఆరబోత డోస్ మరింతగా పెంచేసింది. గ్లామర్ గ్లామర్ అంటూ ఫోటో షూట్స్ చేయించేసి సోషల్ మీడియాలో వదులుతుంది. రాశి ఖన్నా గ్లామర్ షూట్ కి పడిపోని యూత్ లేరు. తాజాగా రాశి ఖన్నా వదిలిన పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే. లూజ్ హెయిర్ తో మత్తెక్కించే చూపులతో రాశి ఖన్నా బ్లూ కలర్ బ్లౌజ్ లో అదరగొట్టేసింది.
రాశి ఖన్నా అందాల విందు చూస్తే వావ్ అనకుండా ఉండలేరు.. మరి ప్రస్తుతం సౌత్ లో ఎలాంటి ప్రాజెక్ట్ రాశి ఖన్నా చేతిలో లేదు. కథలు వింటున్నా, త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తా అంటూ కాకమ్మ కబుర్లు చెబుతుంది పాప.