మంచు మనోజ్ భూమా మౌనికని రెండో వివాహం చేసుకున్నాడు. గత నెల ఇదే రోజు మంచు మనోజ్-మౌనికల వివాహం మంచు లక్ష్మి ఇంట అంగరంగ వైభవంగా కొద్దిమంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో జరిగిపోయింది. ఆ తర్వాత తన భార్య మౌనికతో కలిసి కర్నూల్ వెళ్లి అక్కడినుండి తిరుమల శ్రీవారి దర్శనంలో పాల్గొన్నాడు. ఆ తరవాత మంచు బ్రదర్స్ వార్ సోషల్ మీడియాని ఊపేసింది. మంచు మనోజ్-మంచు విష్ణులు కొట్టేసుకుంటారనే అనే విధంగా సోషల్ మీడియాలో యుద్ధం నడిచింది.
ఆ తర్వాత అదేమీ పెద్ద విషయం కాదు హౌస్ అఫ్ మంచు రియాలిటీ షో అంటూ మంచు విష్ణు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా.. మనోజ్ దానికి ఒప్పుకోలేదని తెలుస్తుంది. అదలా ఉంటే గత నెల ఇదే రోజు అంటే మార్చ్ 3 న మౌనిక మెడలో మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచిన మనోజ్.. పెళ్లి జరిగి నెల పూర్తయిన సందర్భంగా ఓ క్యూట్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఆ వీడియోలో మనోజ్ తన కొత్త భార్య మౌనికతో కలిసి నడుస్తూ ఇంట్లోకి వెళుతున్నాడు.
ఇక ఆ వీడియో తో పాటుగా మంచు మనోజ్ ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమతో జీవించు అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. అన్నట్టు మౌనిక మొదటి భర్తకి పుట్టిన బిడ్డని మనోజ్ తన కొడుకు లెక్క కాదు.. తన కొడుకుగా పెంచుతా అంటూ పెళ్లినాడే ప్రమాణం కూడా చేసాడు.