Advertisementt

NTR30: జాన్వీ కపూర్ రోల్ రివీల్డ్

Mon 03rd Apr 2023 10:42 AM
ntr30,janhvi kapoor  NTR30: జాన్వీ కపూర్ రోల్ రివీల్డ్
NTR30: Janhvi Kapoor role revealed NTR30: జాన్వీ కపూర్ రోల్ రివీల్డ్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో రెండో మూవీగా తెరకెక్కబోతున్న NTR30 ఎట్టకేలకు సెట్స్ మీదకి వెళ్ళింది. గత నెలలోనే పూజా కార్యక్రమాలతో మొదలైన NTR30 రెండు రోజుల క్రితమే అఫీషియల్ గా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసుకుంది.. వస్తున్నాం అంటూ ఎన్టీఆర్ కొత్తగా బ్యాక్ లుక్ తో సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న వీడియోతో షూట్ మొదలైనట్టుగా మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా అందాల తార శ్రీదేవి కుమర్తె జాన్వీ కపూర్ సౌత్ కి గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ అవుతుంది. 

అయితే ఇప్పటివరకు సోషల్ మీడియాలో మోడ్రెన్ గానే కనిపించే జాన్వీ కపూర్.. బాలీవుడ్ మూవీస్ లో మాత్రం గ్లామర్ రోల్స్ చెయలేదు. గ్లామర్ పాత్రలకి దూరంగా నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేసింది. అందుకే ఇప్పుడు NTR30 లో జాన్వీ కపూర్ లుక్ ని చూసి.. అసలు ఆమె రోల్ ఏమిటి? గ్లామర్ గా ఉంటుందా? లేదంటే డీ గ్లామర్ రోల్ ఏమైనా జాన్వీ కపూర్ చేస్తుందా? అని శ్రీదేవి అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు క్యూరియాసిటీగా ఉన్నారు. 

అయితే జాన్వీ కపూర్ బర్త్ డే రోజు ఆమెకి NTR30 లోకి వెల్ కామ్ చెబుతూ సారీలో అది కూడా ముతక చీరలో డీ గ్లామర్ గానే పరిచయం చేసారు. మరి NTR30 లో జాన్వీ కపూర్ రోల్ కాస్త మాస్ షేడ్స్ లో ఉండబోతుందట. జాన్వీ ఈ చిత్రంలో ఓ మత్య్సకారుని కూతురిగా కనిపించనుందట. ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు జాన్వీ ఎప్పటినుండో ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. ఫస్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై యాక్షన్ సన్నివేశాల చిత్రకరణ చేపట్టిన కొరటాల సెకండ్ షెడ్యూల్ నుండి ఎన్టీఆర్-జాన్వీ లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారని తెలుస్తుంది.

NTR30: Janhvi Kapoor role revealed:

 Janhvi Kapoor role revealed in NTR30

Tags:   NTR30, JANHVI KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ