దసరా సినిమా పోయింది.. ఐదారు సినిమాల కథలతో దసరాకి శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించాడు.. అసలు శ్రీకాంత్ ఓదెలకి ఏం ఎక్స్పీరియెన్స్ ఉంది, దసరాలో కొత్తదనమే లేదు. ఇంటర్వల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ లో ట్విస్టివ్వడం బాగానే ఉంది.. కానీ సాదా సీదా క్లైమాక్స్ దసరాని తేల్చేసింది, నాని ఫ్రెండ్ సూరి కూడా గొప్పగా నటించలేదు, సముద్రఖనిని వాడుకోలేదు.. అబ్బో ఇలా చాలానే విమర్శించినవారు ఇప్పుడు దసరా కలెక్షన్స్ చూసి కామైపోతున్నారు. నిన్నటివరకు దొంగలెక్కన్నవారి నోరు ఇప్పుడు పడిపోయింది.
నైజాంలో దసరా కలెక్షన్స్ చూసి కళ్ళు తేలేస్తున్నారు. మొదటి రోజే వాల్తేర్ వీరయ్యని దాటేసి రికార్డ్ క్రియేట్ చేసిన నాని దసరా.. రెండు, మూడు, నాలుగో రోజు అదే ఊపు చూపించింది. మొదటి వీకెండ్ లోనే దసరా నైజాం కలెక్షన్స్ పై సదరు విమర్శకులు.. దసరా కలెక్షన్స్ నైజాంలో సూపర్.. ఆంధ్రలో ఓకె అనే రాతలు మొదలు పెట్టారు. మరి దసరా మేకర్స్ సదరు విమర్శకులకు ఏమి ముట్టజెప్పలేదేమో.. అందుకే నెగెటివ్ రివ్యూస్, నెగెటివ్ న్యూస్ లు రాస్తూ నానిని, దసరాని తొక్కేసే ప్రయత్నం చేసారు.
కంటెంట్ బలంగా ఉంటే.. ఆడియన్స్ మెచ్చితే ఎవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చెయ్యలేరు అని దసరా సినిమా నిరూపించింది. మరి ఇప్పటికైనా దసరా సినిమా హిట్ ఎక్కడయ్యింది.. తప్పుడు కలెక్షన్స్ అన్నవారు ఏం చేస్తారో చూద్దాం.