రీసెంట్ గానే రామ్ చరణ్ తన పుట్టిన రోజు వేడుకల్ని గ్రాండ్ గా హైదరాబాద్ లోనే సెలెబ్రేట్ చేసుకుని భార్య ఉపాసనతో కలిసి దుబాయ్ చెక్కేసాడు. కొద్దిరోజులుగా నాటు నాటు సాంగ్ ఆస్కార్ కోసం అమెరికాలో గడపడం, హైదరాబాద్ వచ్చాక గేమ్ ఛేంజర్ షూటింగ్ లో జాయిన్ అయ్యి సాంగ్ షూట్ కంప్లీట్ చేసిన రామ్ చరణ్ ఇప్పుడు భార్యకి సమయం కేటాయించి మరీ దుబాయ్ కి తీసుకువెళ్లాడు. ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ మంత్ ఆరో నెల నుండి ఏడో నెలలోకి వెళ్ళింది.
దానితో ఉపాసన ఫ్రెండ్స్ దుబాయ్ లో ఉపాసనకు బేబీ షోయర్ ఫంక్షన్ చేసారు. ఉపాసన వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా మెరిసిపోతూ ఫ్రెండ్స్ తో కలిసి ఈ వేడుకలని ఎంజాయ్ చేసిన పిక్స్, వీడియోస్ వైరల్ గా మారాయి. మామూలుగానే ఉపాసన శ్రీమంతం కోసం మెగా ఫ్యామిలీ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏడో నెలలోనే ఉపాసనకు ఈ వేడుకని నిర్వహించాలని కామినేని ఫ్యామిలీ, మెగా ఫామిలీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫ్యామిలీ ఫంక్షన్ కన్నా ముందే ఉపాసన ఫ్రెండ్స్ తో కలిసి నిన్న శనివారం తన బేబీ షోయర్ ఫంక్షన్ ని సెలెబ్రేట్ చేసుకుంది.
రామ్ చరణ్-ఉపాసన కొద్దిరోజులు దుబాయ్ లోనే ఎంజాయ్ చెయ్యబోతున్నారు. తర్వాత హైదరాబాద్ తిరిగి రాగానే చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ లో జాయిన్ అవుతాడు.