అఖిల్ అక్కినేని-సురేందర్ రెడ్డిల ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ విడుదల విషయంలో మేకర్స్ చేస్తున్న తాత్సారానికి అక్కినేని అభిమానులకి పిచ్చెక్కిపోతుంది. ఏజెంట్ షూటింగ్ విషయంలో ఏ జరుగుతుందో అర్ధం కాక తల పట్టుకుంటున్నారు . పదే పదే రిలీజ్ తేదీలు మార్చుకుంటూ ఫైనల్ గా సమ్మర్ హాలిడే లో ఏప్రిల్ 28 న విడుదలకి సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. ఇంకా ఖచ్చితంగా 25 రోజులు మాత్రమే విడుదలకు సమయం ఉంది.
ఇప్పటివరకు ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. ఏదో రెండు సాంగ్స్ వదిలారు ఓకె. తర్వాత కామైపోయారు. పాన్ ఇండియా రిలీజ్ అంటే ఎలా ఉండాలి. కానీ ఏజెంట్ మేకర్స్ ఈ విషయాన్ని పట్టించుకోవడంలేదు అని అక్కినేని ఫాన్స్ బాధ. సోషల్ మీడియాలో మాత్రం #Agent విడుదల తేదీపై విపరీతంగా వినిపిస్తున్న రూమర్లు.. అయినా 28 పక్కా విడుదల అంటున్న యూనిట్. ఒక పాట బకాయి అన్నది అలాగే వుంది. సిజి పనులు జరుగుతున్నాయి. మూడు వారాల్లో అన్నీ పూర్తి కావాల్సి వుంటుంది.. అని ఒకరు..
మరొకరు నిన్నటి తో కేరళ 2డేస్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ఈ రోజు టీం #Agent ముంబై లో ఉంది. 1డే ప్యాచ్ వర్క్.. (విలన్ సీన్స్ ) హైదరాబాద్ లో సెట్ లో సాంగ్ షూట్ 11,12,13,14 తేదీల్లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ చిత్రీకరణ ఉంటుంది. దీనితో టోటల్ వర్క్ ఫినిష్ అవుతుంది.. అంటూ రకరకాల న్యూస్ లు వినిపించడంతో ఫాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.
షూటింగ్ అలా జరుగుతున్న సమయంలో ఇటు ప్రమోషన్స్ మొదలు పెట్టేస్తే.. ఈ రూమర్స్ ఆగుతాయి. లేదంటే మరోసారి ఏజెంట్ విషయంలో మేకర్స్ పరువుపోతుంది.