Advertisementt

వెకేషన్స్ లో పవన్ కళ్యాణ్

Sun 02nd Apr 2023 12:23 PM
pawan kalyan with family  వెకేషన్స్ లో పవన్ కళ్యాణ్
Pawan Kalyan on a vacation with family వెకేషన్స్ లో పవన్ కళ్యాణ్
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకి కొద్దిగా బ్రేక్ ఇచ్చారు. అలాగే సాయి తేజ్ తో సముద్రఖని దర్శకత్వంలో చేస్తున్న PKSDT షూటింగ్ కంప్లీట్ చేసేసారు. ఆ సినిమా జూన్ రిలీజ్ అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించేసారు. అయితే క్రిష్ తో చెయ్యాల్సిన హరి హర వీరమల్లుపై ఇప్పుడు పవన్ ఫాన్స్ లో అయోమయం మొదలయ్యింది. నిన్నగాక మొన్న మొదలైన సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ప్రకటించి హంగామా చేస్తుంటే.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లుకి మోక్షం ఎప్పుడో తెలియడమే లేదు.

మరోపక్క షూటింగ్స్ నుండి బ్రేక్ దొరకడంతో పవన్ కళ్యాణ్ భార్య అన్నా, కుమార్తె పోలేనా, కొడుకు మార్క్ శంకర్ లతో కలిసి రాజస్థాన్ వెకేషన్స్ కి వెళ్లారు. పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీతో కలిసి ఉదయ్ పూర్ ఎయిర్ పోర్టులో వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే పవన్కళ్యాణ్ ఈ ట్రిప్ నుండి రాగానే.. హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఒక్కసారి పవన్ సెట్స్ మీదకి వస్తే.. హరీష్ శంకర్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 5 నుండి కానీ, 10 నుండి సెట్స్ మీదకి వెళ్లే సూచనలున్నాయి. ఇక క్రిష్ పరిస్తితే అర్ధమవడం లేదు. హరి హర వీరమల్లు డేట్ ఎప్పుడివ్వాలో ఆయనకి అర్థకాని సంకట స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 

Pawan Kalyan on a vacation with family:

Small Vacation Trip Pawan Kalyan with Family

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ