Advertisementt

ఐశ్వర్య అలాంటిది.. అందుకే ఇలా చేశాను

Sat 01st Apr 2023 08:33 PM
aishwarya rajinikanth  ఐశ్వర్య అలాంటిది.. అందుకే ఇలా చేశాను
Aishwarya Rajinikanth maid reveals shocking facts ఐశ్వర్య అలాంటిది.. అందుకే ఇలా చేశాను
Advertisement
Ads by CJ

ఈమధ్యన చెన్నైలోని ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ధనుష్ నుండి విడిపోయాక విడిగా ఉంటున్న ఐశ్వర్య ఇంట్లో 60 లక్షలకు పైగా విలువ చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలు, కొన్ని విలువైన డాక్యుమెంట్స్ మిస్ అయినట్లుగా ఐశ్వర్య పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా.. తన ఇంట్లోనే పని చేసే ఈశ్వరి, కారు డ్రైవర్ వెంకటేష్ లపై అనుమానం ఉన్నట్లుగా పోలిస్ లకి ఫిర్యాదు చెయ్యగా.. వారి స్టయిల్లో విచారణ చేపట్టిన పోలీసులకి.. ఐశ్వర్య ఇంట్లో ఎప్పటినుండో పని చేస్తున్న ఈశ్వరి, వెంకటేష్ లే ఈ దొంగతనము చేసినట్టుగా కనిపెట్టారు.

వారిద్దరిని అలాగే ఎవరికి సహాయం చేసిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించగా.. ఐశ్వర్య పని మనిషి ఈశ్వరి ఈ విచారణలో షాకింగ్ విషయాలను వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఐశ్వర్య ఇంట్లో ఎప్పటినుండో గొడ్డు చాకిరీ చేస్తున్నా తనకి నెలకి 30 వేలు మాత్రమే జీతం ఇచ్చేది. కానీ వాళ్ళ ఇంట్లో బోలెడంత డబ్బు, నగలు ఉన్నాయి. కానీ జీతంగా 30 వేలు మాత్రమే ఇచ్చేది, ఆమె చెప్పినపనులన్నీ చేసినా అంతే జీతం ఇచ్చేది. ఆ 30 వేలు ఓ ఫ్యామిలీకి బ్రతకడానికి సరిపోతుందా. అందుకే దొంగతనం చెయ్యడం మొదలు పెట్టాను అంటూ.. మొదట్లో చిన్న చిన్న వస్తువులను దొంగిలించడం చేసినా నేను దొరికిపోలేదు. దీంతో ధైర్యం చేసి నగలు కూడా దోచుకున్నాను.

ఈ దొంగతనంతో నేను దొరకకపోయి ఉంటే ఇంకా దొంగతనం చేసేదానిని.. అలా దొంగిలించిన వాటితో ఇప్పటికే తాను రెండంతస్తుల ఇల్లు కూడా కొన్నానని పోలీసులకు ఈశ్వరి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఈశ్వరి ఐశ్వర్య ఇంట్లోనే కాకుండా రజినీకాంత్, ధనుష్ ఇంట్లోనూ పని చేస్తూ నమ్మకంగా ఉండేదని.. కానీ డబ్బు ఆమెని మార్చేసినట్లుగా పోలీసులు చెబుతున్నమాట.

Aishwarya Rajinikanth maid reveals shocking facts:

Aishwarya Rajinikanth Maid Reveals Why Did She Theft House

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ