మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఏడాదిన్నర క్రితం ఘోరమైన రోడ్ యాక్సిడెంట్ కి గురై చాలారోజుల పాటు అపోలో ఆసుపత్రిలో, డిశ్ఛార్జ్ అయ్యి ఇంటికొచ్చాక కూడా చాలా కాలం పాటు ఇంట్లోనే ఉండిపోయాడు. దానితో సాయి తేజ్ కి ఏదో అయ్యింది అంటూ సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లు ప్రచారం లోకి వచ్చాయి. సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ లో ఓకల్ కార్డ్ దెబ్బతినడం, భుజానికి దెబ్బతగలడంతో చాలా రోజులు కోలుకోలేకపోయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం సాయి తేజ్ విరూపాక్ష సినిమాని రిలీజ్ కి రెడీ చేస్తుండగా.. చిన్న మేనమావ పవన్ కళ్యాణ్ తో PKSDT లో నటిస్తున్నాడు.
తాజాగా సాయి తేజ్ ఎప్పుడో జరిగిన తన యాక్సిడెంట్ పై పెదవి విప్పాడు. నాకు జరిగిన ప్రమాదం పీడకల కాదు.. ఓ స్వీట్ మెమరీ.. మంచి లెసన్.. ప్రమాదం జరిగి మంచాన వుంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసారు.. ఇప్పటివరకు ఇద్దరు మావయ్యలు పవన్ కళ్యాణ్, నాగబాబులతో కలిసి సినిమాలు చేసా..పెద్ద మామయ్య చిరూతో కూడా ఓ సినిమా చేస్తాననే నమ్మకం వుంది. భయాన్ని మించి ఎదగాలని అమ్మ నేర్పింది. ప్రమాదం తరువాత నా ఆలోచనావిధానం పూర్తిగా మారింది.. అంటూ సాయి తేజ్ తనకి జరిగిన ప్రమాదంపై స్పందించాడు.