Advertisementt

ఎన్టీఆర్ హీరోయిన్ ముత్యాల సొగసులు

Sat 01st Apr 2023 03:55 PM
janhvi kapoor,neeth mkhesh ambani culuture center  ఎన్టీఆర్ హీరోయిన్ ముత్యాల సొగసులు
Janhvi Kapoor wore a pearl studded lehenga with a shrug ఎన్టీఆర్ హీరోయిన్ ముత్యాల సొగసులు
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సౌత్ లోకి పాన్ ఇండియా మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్న అతిలోక సుందరి కుమర్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో గ్లామర్ పరంగా ఓ సెన్సేషన్. ఆమె సౌత్ లోకి అది కూడా ఎన్టీఆర్ సినిమాతో ఎంటర్ అవుతుండడంతో ఆమెపై సౌత్ లో కూడా ఇంట్రెస్ట్ మొదలయ్యింది. విజయ్ దేవరకొండ, మహేష్ ఇలా చాలామంది పేర్లు జాన్వీ సౌత్ ఎంట్రీ పై వినిపించాయి కానీ.. ఫైనల్ గా ఈ గ్లామర్ బ్యూటీ ఎన్టీఆర్ తో ఎంట్రీ ఇస్తుంది. 

రీసెంట్ గా జరిగిన NTR30 ఓపెనింగ్ కార్యక్రమాల్లో సింపుల్ గా సారీ లుక్స్ లో కనిపించిన జాహ్నవి కపూర్ తాజాగా ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ లో తళుక్కుమంది, బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీస్ ల్యాండ్ అయిన ఈ ఈవెంట్ లో తారలంతా నిజంగానే నక్షత్రాల్లా మెరిసిపోయారు. ప్రియాంక చోప్రా, కియారా అద్వానీ, అలియా భట్, ఐశ్వర్య రాయ్ ఇలా ప్రతి ఒక్కరూ డిజైనర్ డ్రెస్సులతో తళుక్కుమనిపించారు.

మరి ఎప్పుడూ మోడ్రెన్ డ్రెస్సులతో, డిజైనర్ వెర్స్ తో అదరగొట్టేసే జాన్వీ కపూర్.. వైట్ కలర్ లెహంగాలో ముత్యాలు పొదిగిన డ్రెస్ లో మెరిసిపోయింది. ఆమె జుట్టును బన్‌లో కట్టి, చెవిపోగులతో తన అందాన్ని మరింత బ్రైట్ గా ఉండేలా చూసుకుంది. ఆమె నెక్ కి చోకర్ నెక్లెస్ కూడా ధరించింది, ఆ తెల్లని డ్రెస్ లో జాన్వీ కపూర్ ఏంజెల్ లా మెరిసిపోయింది. ఆ పిక్స్ ని జాన్వీ ఇన్స్టా లో షేర్ చేసింది. వాటిని చూడగానే వావ్ జాన్వీ అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు.

Janhvi Kapoor wore a pearl studded lehenga with a shrug:

Janhvi Kapoor Alluring Pics At Neeth Mkhesh Ambani Culuture Center Opening

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ