పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ప్రభాస్ కూడా గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు. సలార్ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. సెప్టెంబర్ 28 టార్గెట్ గా తెరకెక్కుతున్న సలార్ నుండి టీజర్ అప్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
అయితే సలార్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ప్రభంజనంగా మారబోతుంది అనే న్యూస్ చూసిన ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే సలార్ థియేట్రికల్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్, డిజిటల్ అండ్ శాటిలైట్స్ రైట్స్ మీద వినిపిస్తున్న వార్తలు వాళ్ళకి కునుకు రానివ్వడం లేదు. తాజాగా సలార్ ఓవర్సీస్ రైట్స్ 70 కోట్లు పలుకుతున్నట్లుగా ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. #Salaar హాష్ టాగ్ ట్రెండ్ చేస్తూ సలార్ ఓవర్సీస్ రైట్స్ పై ఈ క్రేజీ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు.
అంతేకాకుండా.. నైజాం నుంచి ఉత్తరాది వరకు, ఆంధ్రా నుంచి ఓవర్సీస్ వరకు అన్నిచోట్లా #Prabhas #Salaar అడ్డా అంటూ ప్రభాస్ ఫాన్స్ రెచ్చిపోయి ట్వీట్స్ వేస్తున్నారు.