యంగ్ బ్యూటీ, లక్కీ బ్యూటీ శ్రీలీల ఇప్పుడు టాక్ అఫ్ ద టాలీవుడ్ అనే చెప్పాలి. యంగ్ హీరోల పక్కన జోడిగా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల ఇప్పుడు స్టార్ హీరోల చెంత చేరబోతోంది. ఇప్పటికే మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న SSMB28 లో వన్ అఫ్ ద హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలకృష్ణ #NBK108 లోను కీలక పాత్రలో నటించనుంది. ఇక వైష్ణవ తేజ్, వరుణ్ తేజ్, నితిన్, రామ్ ఇలా వరస ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా న్యూస్ లో కనిపిస్తుంది.
ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడిగా ఛాన్స్ కొట్టేసిందనే టాక్ మొదలైంది. హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబోలో మొదలు కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతుంది. ముందు పూజా హెగ్డే ని అనుకున్నా.. ప్రస్తుతం ఆమె డౌన్ లో ఉండడంతో.. శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం యంగ్ అండ్ ఎనెర్జిటిక్ డాన్స్ లతో, అందంగా కర్షణీయంగా దూసుకుపోతున్న శ్రీలీల పవన్ పక్కన అయితే అదిరిపోతోంది అని పవన్ ఫాన్స్ భావిస్తున్నారు.
ఏప్రిల్ మొదటి వారం అంటే ఈ వారంలోనే ఉస్తాద్ భగత్ ని సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తో పని చేసేందుకు ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళతానా అన్నట్టుగా శ్రీలీల ఉంది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీలీల ఏప్రిల్ 10 నుండి పవన్-హరీష్ తో కలిసి ఉస్తాద్ సెట్స్ లో సందడి చేయనుంది అనే న్యూస్ ఆమె అభిమానులని నిలువనియ్యడం లేదు. ఇక అదే విషయం అధికారికంగా తెలిస్తే అస్సలు ఆగరేమో.