మహానటితో బిగ్గెస్ట్ సక్సెస్ ని సాధించి ఆ హిట్ ని బాగా అస్వాధించింది. ఆ తర్వాత కీర్తి సురేష్ మాత్రం స్టార్ స్టేటస్ ని మెయింటింగ్ చెయ్యలేకపోయింది. కీర్తితో సురేష్ ఇప్పటివరకు నటించిన సినిమాలేవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాలేదు. మహానటిని మినహాయిస్తే కీర్తి సురేష్ కి ఇప్పటివరకు కమర్షియల్ హిట్ పలకరించలేదు. తమిళంలో స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించింది. కానీ చెప్పుకునేంత హిట్ తగల్లేదు. ఇక తెలుగులో మహేష్ సినిమాలో గ్లామర్ ఒలకబోసింది. పని జరగలేదు. ఇప్పుడు నానితో దసరాలో వెన్నెలగా డీ గ్లామర్ పాత్రలో నటించింది.
దసరా సూపర్ హిట్ అయ్యింది, ప్రపంచ వ్యాప్తంగా దసరా వసూళ్లు అదిరిపోతున్నాయి. పాన్ ఇండియాలోని పలు భాషల్లో విడుదలైన దసరాకి టాక్ బావుంది వసూళ్ళు బావున్నాయి. ధరణి పాత్రతో పాటుగా కీర్తి సురేష్ వెన్నెల పాత్రకి మంచి పేరొచ్చింది. వెన్నెల పాత్రలో కీర్తి నటనకు మంచి ప్రసంశలు దక్కాయి. మహానటి తర్వాత కీర్తి సురేష్ కి చెప్పుకొదగ్గ విజయం ఇదే అంటున్నారు ప్రేక్షకులు. ఇప్పటివరకు కమర్షియల్ హిట్ అందుకొని కీర్తి సురేష్ మొదటిసారి నానితో కలిసి ఈ హిట్ ని ఆస్వాదిస్తోంది.
మహానటి మహానటి అంటూ కీర్తి సురేష్ ఏ కేరెక్టర్ లో కనిపించినా.. అందరికి మహానటి పాత్ర గుర్తుకు రావడమే ఆమెకి బిగ్ మైనస్ గా మారింది. అలాగే ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకి నో చెప్పిన కీర్తి సురేష్ ఇప్పుడు గ్లామర్ కేరెక్టర్స్ కి సై అంటుంది. ఆమెకి బ్రేకిచ్చే హీరోనే దొరకలేదు. కానీ తన ఫ్రెండ్ నాని కీర్తి సురేష్ కి దసరాతో బ్రేక్ ఇవ్వడమే కాదు.. కమర్షియల్ సక్సెస్ ని కూడా కట్టబెట్టాడు. ఈ సినిమాతో కీర్తి సురేష్ రేంజ్ మారుతుంది అని ఆమె నమ్ముతున్నట్టుగా ఆమె ఫాన్స్ కూడా ఆశపడుతున్నారు.