IPL 2023 మొదలైంది, IPL ఓపెనింగ్ ఈవెంట్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో అంగరంగ వైభవంగా మొదలైపోయింది. గత రెండేళ్లుగా కరోనా వలన IPL ని జస్ట్ టివిలలోనే వీక్షించిన క్రికెట్ లవర్స్ ఈసారి టికెట్స్ కొనుక్కుని మరీ స్టేడియంకి పరుగులు పెడుతున్నారు. అందుకే ఈ ఏడాది మాత్రం ఫుల్ జోష్ లో IPL మొదలైంది. హడావిడి, హంగామాతో IPL మొదలు పెట్టేందుకు సినీతారల ఆటాపాటని ఎంచుకుంది IPL యాజమాన్యం. క్రికెటర్స్ లో జోష్ నింపాలన్నా, ఆడియన్స్ ని ఆకర్షించాలన్నా ఈ మాత్రం సందడి కావాల్సిందే. అందుకే టాప్ సెలబ్రిటీస్ ని IPL కోసం రంగంలోకి దింపింది.
మ్యూజిక్ కంపోజర్ అరిజీత్ సింగ్ లైవ్ పెర్ఫార్మెన్స్‌తో పాటు తమన్నా, రష్మిక మందన డాన్స్ షో పెరఫామెన్స్ లు IPL వేడుకలో హైలెట్ గా నిలిచాయి. తమిళ సాంగ్ తో తమన్నా డాన్స్ పెరఫార్మెన్స్ తో ఈ ఈవెంట్ మొదలవగా.. రష్మిక మందన్న తనకి బాగా కలిసొచ్చిన పుష్పలోని సామీ సామీ పాటతో పెర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది. సామీ సామీ అంటూ తన మార్క్ స్టెప్పులతో మరోసారి ఊపేసింది. IPL లో మొదటిసారి తెలుగు, తమిళ సాంగ్స్ తో ఈ పెరఫార్మెన్స్ లు జరిగాయి.
ఇక రష్మిక IPL ఈవెంట్ కి వెళ్లేముందు ఇంటర్నెట్ లో తాను IPL ఈవెంట్ లో ఇవ్వబోయే స్టేజ్ పెరఫార్మెన్స్ సాంగ్ రిహార్సల్స్ తో అదరగొట్టేసింది. తనకి ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ లో పెర్ఫర్మ్ చేయడాన్ని ఆస్వాదిస్తాను, నేను ఇలాంటి ఈవెంట్స్ లో పెర్ఫర్మ్ చేసిన ప్రతి సారీ చాలా సంతోషంగా ఉంటుంది. ఒక కొత్త ఎనర్జీ వస్తుంది అంటూ రష్మిక తెగ ఎగ్జైట్ అయ్యింది.