మెగాస్టార్ చిరంజీవి ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నారు. ఫుల్ స్వింగ్ లో సినిమా షూటింగ్స్ పూర్తి చేసి సినిమాలని ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు తహతహలాడుతున్నారు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ లను ఆరు నెలలు గ్యాప్ లో విడుదల చేసిన మెగాస్టార్ చిరు.. ఆ గాడ్ ఫాదర్ వచ్చిన మూడు నెలలకే ఈ ఏడాది వాల్తేర్ వీరయ్యతో హిట్ కొట్టేసారు. అది వచ్చిన ఆరు నెలలకే భోళా శంకర్ ని సిద్ధం చేస్తున్నారు.. ఆగష్టు 11 న భోళా శంకర్ విడుదల అంటూ ప్రకటించేసారు.
ఇక మరో సీనియర్ హీరో బాలకృష్ణ కూడా ఎక్కడా తగ్గడమే లేదు. అఖండ వచ్చిన ఏడాదికి వీర సింహ రెడ్డిని ఆడియన్స్ ముందుకు తెచ్చిన బాలయ్య ఇదే ఏడాది దసరాకు #NBK108 ని విడుదలకు సిద్ధం చేసేసారు. ఏడాదికి రెండు సినిమాలంటూ చిరు-బాలయ్య లు ఇద్దరూ అభిమానులకి ఊపిరాడనివ్వడం లేదు. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లతో ఫాన్స్ కి ట్రీట్స్ మీద ట్రీట్స్ ఇస్తున్నారు. బాలయ్య, చిరు ఇద్దరూ సంక్రాంతికి పోటీ పడ్డారు. మళ్ళీ దసరా బరిలో కూడా పోటీకి వెళతారనుకుంటే.. చిరు ఆగష్టు లోనే వచ్చేస్తున్నారు.
బాలయ్య మాత్రం దసరాకి ఫిక్స్ చేసారు. మరి యంగ్ హీరోల కన్నా ఈ సీనియర్ హీరోలే షూటింగ్స్, సినిమాల విషయంలో అస్సలు తగ్గడం లేదు. నిజంగా వీళ్ళతో పని చేసే దర్శకులు షార్ప్ గా ఉండాలేకాని.. వీరు మాత్రం ఏడాదికి పక్కాగా రెండు రిలీజ్ చేసేలా ఉన్నారు.