Advertisementt

అలియాని అలా చూస్తే వావ్ అనాల్సిందే

Fri 31st Mar 2023 09:55 PM
alia bhatt  అలియాని అలా చూస్తే వావ్ అనాల్సిందే
Alia Bhatt Makes a Jaw Dropping Appearance in Saree అలియాని అలా చూస్తే వావ్ అనాల్సిందే
Advertisement
Ads by CJ

బాలీవుడ్ క్యూటీ అలియా భట్ వ్యక్తిగత జీవితంలో గత ఏడాది మరపురాని సంవత్సరం. కోరుకున్నవాడు రణబీర్ కపూర్ తో ఏడడుగులు నడవమే కాదు, అంతలోనే ప్రెగ్నెంట్, పాప పుట్టడం ఇవన్నీ అలియాకి 2022 ఏడాది అపురూపంగా నిలిచిపోయేలా చేసింది. అలాగే ఆస్కార్ కొల్లగొట్టిన ఆర్.ఆర్.ఆర్ లో అలియా భట్ భాగమవడం, బ్రహ్మాస్త్రతో అద్భుతమైన హిట్ కొట్టిన అలియా భట్ కి గత ఏడాది అంతా స్పెషల్ అనే చెప్పాలి. పాప పుట్టిన నెలకే వర్కౌట్స్, యోగ అంటూ సన్నబడేందుకు కసరత్తులు చేసింది. అలాగే కియారా అద్వానీ రిసెప్షన్ లోను అత్తగారితో కలిసి సందడి చెయ్యడమే కాదు.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టీవ్ గా ఉంటుంది.

ఈమధ్యనే భర్తతో కలిసి లండన్ వెకేషన్స్ కి వెళ్లొచ్చిన అలియా భట్ తాజాగా సారీలో మెస్మరైజ్ చేసింది. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ షిమ్మర్ శారీలో అలియా భట్ మెరిసిపోయింది. హెయిర్ ముడివేసి.. బ్యాక్ లెస్, స్లీవ్ లెస్ బ్లౌజ్ తో అలియా భట్ బ్యూటిఫుల్ లుక్స్, ఆమె ఇచ్చిన ఫోజులు చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. అలియా భట్ ఇంతందంగా రెడీ అయ్యి ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్ ఓపెనింగ్ కి హాజరైనట్టుగా తెలుస్తుంది. మరి పెళ్లి, పిల్లలు తర్వాత అలియా భట్ అందం మరింతగా పెరిగింది.

భర్త రణబీర్ తో వెకేషన్స్, రణ్వీర్ సింగ్ తో కలిసి కరణ్ జోహార్ ఫిల్మ్ లో నటించడం.. ఖాళీ సమయంలో తన పాపతో ఆడుకోవడం, అవార్డు వేడుకలకి అందంగా రెడీ అయ్యి హాజరవడం వంటి బిజీ షెడ్యూల్ తో అలియా భట్ ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం అలియా భట్ బ్యూటిఫుల్ సారీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Alia Bhatt Makes a Jaw Dropping Appearance in Saree:

Alia Bhatt at Karan Johar party

Tags:   ALIA BHATT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ