గ్లామర్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ సక్సెస్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుంది. ఆమె రీసెంట్ గా నటించిన హిందీ వెబ్ సీరీస్ ఫార్జి సూపర్ సక్సెస్ అవడంతో రాశి ఖన్నా గాల్లో తేలిపోతుంది. ఇకపై గ్లామర్ రోల్స్ కన్నా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చెయ్యాలనుకుంటున్నట్లుగా చెబుతుంది. ఇప్పటివరకు గ్లామర్ పై ఫోకస్ చేసి ఆ పాత్రలకే పరిమితమైన రాశి ఖన్నాకి సరికొత్త పాత్రలు ఎవరిస్తారో కానీ.. రాశి ఖన్నా ఫార్జి లో విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ తో కలిసి నటించడం, ఆ సీరీస్ కి మంచి పేరు రావడంతో రాశి పేరు హిందీలో మోగిపోతుంది.
దానితో ఇండియన్ మూవీ డేటా బేస్ IMDB ప్రచురించే సెలబ్రిటీస్ పేర్లలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ని వెనక్కి నెట్టి రాశి ఖన్నా అగ్రస్థానంలో నిలివడం పట్ల ఆమె తన సంతోషాన్ని పట్టలేకపోతుంది. నాకు IMDB ఫస్ట్ ప్లేస్ ఓ పేరు చూసుకున్నాక నన్ను నేనే నమ్మలేకపోయాను, ఆ విషయాన్ని మా నాన్నతో చెప్పాను, ఆయన కూడా ఆశ్చర్యపోయారు. ఆయనకి IMDB గురించి పెద్దగా తెలియదు, షారుక్ కన్నా ముందు నేను ఉన్నానంటే నమ్మలేకపోయారు. అది చెబితే నేను ఆటపట్టిస్తున్నా అనుకున్నారు.
ఇలా జరగడం నా లైఫ్ లో ఓ మైలురాయిలా భావిస్తాను. షారుఖ్ కింగ్ ఖాన్. ఆయన్ని ఎవరు ఓడిస్తారు. నేను ఆయన కన్నా ముందు స్థానంలో నిలబడ్డాను, అంటే నేను నటించిన ఆ పాత్ర ప్రేక్షకాదరణ అంతగా పొందడమే కారణం. ప్రేక్షకులు నా పాత్రని అంతగా ఇష్టపడ్డారంటూ రాశి ఖన్నా ఉబ్బితబ్బిబ్బవుతోంది.