నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల్లో కనిపించడం లేదు. రీసెంట్ గా ఈ బ్యూటీ అల్లు అర్జున్ పుష్ప ద రూల్ లో వన్ అఫ్ ద హీరోయిన్ గా కీ రోల్ పోషించబోతుంది అనే న్యూస్ బాగా వైరల్ అవ్వగా.. దానిని సాయి పల్లవి కొట్టిపారేసింది. తనకి పుష్ప నుండి ఎలాంటి ఆఫర్ రాలేదని.. కానీ నేను పుష్ప పాన్ ఇండియా ఫిలిం లో నటిస్తున్నాను అనే వార్త ఆనందాన్నిచ్చింది అంటూ చెప్పింది. అంతేకాకుండా సాయి పల్లవి రీసెంట్ గా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ వేడుకలో పాల్గొంది. ఆమె నటించిన గార్గి చిత్రానికి గానూ ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది.
ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు సినిమాల్లోకి వచ్చే ముందు రెండు విషయాలంటే భయమేసేదట. అది తన వాయిస్ మరొకటి.. ఆమె మొటిమలు వలన సినిమాల్లో ఎలా కనిపిస్తానో అని భయపడిపోయిందట. ఆ విషయమై ఆమె మాట్లాడుతూ.. నేను మొదట్లో చాలా భయపడ్డాను. ఏ పని చేయ్యాలన్నా అనేక అనుమానాలు ఆపేసేవి. ఆడియన్స్ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో.. నా గొంతుని ఇష్టపడతారో.. నా డ్రెస్సింగ్ స్టయిల్ ని మెచ్చుతారా.. ముఖంపై ఉండే మొటిమలు.. గురించి ఏం మాట్లాడుకుంటారో.. అసలు నన్ను ప్రేక్షకులు ఆదరిస్తారా, లేదా అనుకున్నాను.
మలయాళంలో ప్రేమమ్ సినిమా కోసం డైరెక్టర్ నన్ను సెలెక్ట్ చేసి.. ఆయన నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆ సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల నుండి వచ్చిన రెస్పాన్స్ చూసి నాపై నాకు నమ్మకం పెరిగింది. నన్ను తెరపై చూసినప్పుడు థియేటర్లలో ప్రేక్షకులు చప్పట్లు కొట్టిన క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నేను నటించిన చాలా సినిమాల్లో మేకప్ లేకుండానే నటించాను.. నన్ను ప్రేక్షకులు ఇష్టపడ్డారు.
నాతో సినిమాలు చేసిన డైరెక్టర్స్ కూడా నన్ను మేకప్ వేసుకోమని బలవంతం చేయ్యలేదు. మేకప్ లేకుండా నటిస్తాను కాబట్టే నన్ను ఎక్కువమంది ప్రేక్షకులు ఇష్టపడుతున్నారంటూ సాయి పల్లవి తన అనుమాలు, భయాలను బయటపెట్టింది.