కాజల్ అగర్వాల్ సౌత్ లో టాప్ హీరోయిన్ అయ్యాక.. అప్పుడప్పుడు బాలీవుడ్ లో అదృష్టాన్ని పరిక్షించుకునేది. సౌత్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆమెకి పెళ్ళై బిడ్డ పుట్టాక కూడా ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. ఇప్పటికీ కోట్లలోనే పారితోషకం అందుకుంటున్న కాజల్ అగర్వాల్ భర్త, బిడ్డ బాధ్యతలతో పాటుగా తనకిష్టమైన యాక్టింగ్ లోనూ సత్తా చాటుతుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ తమిళంలో కమల్ హాసన్ తో ఇండియన్ 2 లో నటిస్తుంది. అలాగే టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ NBK108 లోను బాలయ్యకి జోడిగా కనిపించబోతుంది.
అయితే కాజల్ అగర్వాల్ అప్పుడప్పుడూ బాలీవుడ్ కి వెళ్లినా ఆమెకి అక్కడ సక్సెస్ దొరకలేదు. అందుకే కాజల్ మరోసారి బాలీవుడ్ వైపు చూడకుండా సౌత్ సినిమాలు చేసుకుంటూ ఉండిపోయింది. తాజాగా కాజల్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. హిందీ సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణ, నైతిక విలువలు కనిపించవు. కానీ సౌత్ ఇండస్ట్రీలో ఓ క్రమశిక్షణ కనపడుతుందని, సౌత్ ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ నేచర్ కనిపిస్తుందని, భాషాభేదాలతో పట్టింపు లేకుండా ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిని సౌత్ సినిమా ఆదరిస్తుంటుందని చెప్పిన కాజల్.. ఆ స్నేహతత్వం బాలీవుడ్‌లో ఉండదని.. బాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అంతేకాకుండా పెళ్లి తర్వాత ప్రెగ్నెంట్ అయ్యాక నా శరీరంలో చాలా మార్పు వచ్చింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు లావు అయ్యావంటూ కొందరు కామెంట్స్ విసిరారు. బాడీ పై కామెంట్స్ కు గురయ్యాను. కానీ అలాంటి వ్యాఖ్యలని నేను పట్టించుకోలేదు. ఒక వైపు నటిగా, మరో వైపు తల్లిగా కొనసాగటం అనేది చాలా కష్టమైన పని. నా కొడుకు చాలా చిన్నవాడు. వాడిని ఇంట్లోనే వదిలేసి వర్క్‌కి వెళుతుంటే గుండె బద్దలవుతుంటుంది. అమ్మ వాడిని బాగా చూసుకుంటుంది. నేను చేసే పనిని ప్రేమిస్తున్నాను. కాబట్టి బిడ్డతో ఈ ఎడబాటు తప్పదు. రేపు నా పిల్లాడు పెరిగి పెద్దయితే నా కష్టాన్ని అర్థం చేసుకుంటాడనే అనుకుంటున్నాను.. అంటూ కాజల్ చెప్పుకొచ్చింది.