నిజంగా ఆదిపురుష్ మేకర్స్ ని చూస్తే జాలేస్తుంది. ఎన్నో అంచనాల నడుమ ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేస్తే.. దానిని ట్రోల్ చేసినవారే కానీ.. ట్రోల్ చేయనివారు లేవు. ప్రభాస్ ని ఆధ్యాత్మికత ఉన్న రాముడి అవతారంగా ఊహించుకుంటే యానిమేనేషన్ రాముడిగా చూపించారంటూ దర్శకుడు ఓం రౌత్ పై తీవ్ర విమర్శలొచ్చాయి యానిమేటెడ్ రాముడిగా ప్రభాస్ కదులుతుంటే చూడలేకపోయిన ప్రభాస్ ఫాన్స్ కూడా ఆందోళన వ్యక్తం చేసారు. దానితో ఆదిపురుష్ మేకర్స్ బెస్ట్ విఎఫెక్స్ కోసం సినిమాని ఆరు నెలలు పోస్ట్ పోన్ చేసారు.
ఇక జూన్ లో విడుదల చెయ్యబోతున్న ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ నిన్న శ్రీరామనవమి రోజునుండి మొదలు పెట్టారు. దాని కోసం రాముడిగా ప్రభాస్, జానకిగా కృతి సనాన్, లక్ష్మనుడు, ఆంజనేయస్వామి ఉన్న పోస్టర్ వదిలారు. మరి రాముడంటే ఎలా ఉంటాడు.. సహనానికి మారుపేరు, ఆయన రూపం చూడగానే మనసులో ఆధ్యాత్మికత పుట్టాలి.. రాముని చల్లని చూపు ఇవన్నీ కాకుండా.. ఆదిపురుష్ రాముడు మాత్రం కోపంతో రగిలిపోవడమే కాదు.. ఆయన కాస్ట్యూమ్స్ మీద కూడా తీవ్ర విమర్శలు రావడం మరోసారి ఆదిపురుష్ మేకర్స్ ని డిస్టర్బ్ చేసాయి. ఆఖరికి ప్రభాస్ ఫాన్స్ కూడా ఆదిపురుష్ నవమి పోస్టర్ ని విమర్శిస్తున్నారు అంటే.. మరోసారి ఆదిపురుష్ మేకర్స్ ఫాన్స్ ని డిస్పాయింట్ చేసినట్టేగా.
టీజర్ తోనే ఫాన్స్ ఆశలను చెల్లాచెదురు చేసిన ఓం రౌత్ ఇలా పోస్టర్ తో ఇంప్రెస్స్ చెయ్యకపోగా.. మరోసారి ట్రోలర్స్ కి పని ఇచ్చాడు. ఇలాంటి టీజర్స్, పోస్టర్స్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించగలవా.. అసలు సినిమాపై అంచనాలు క్రియేట్ చేయగలవా.. అంటూ ఫాన్స్ తలపట్టుకుంటున్నారు. శ్రీరామనవమి ఆదిపురుష్ పోస్టర్ పై వస్తున్న ట్రోల్స్ చూసి మేకర్స్ కి మరోసారి టెన్షన్ స్టార్ట్ అయ్యినట్లుగా తెలుస్తుంది. ఇదంతా చూస్తే పాపం ఆదిపురుష్ మేకర్స్ అనాలేమో.