రామ్ చరణ్ ఒక నెల రోజుల పాటు అమెరికాలోనే ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ అవార్డుల కోసమే ఉండిపోయాడు. ఉపాసన కూడా రామ్ చరణ్ తో కలిసి అమెరికాకి గోల్డెన్ గ్లొబ్ అవార్డు కోసం వెళ్లినా.. తర్వాత HCA అవార్డ్స్ వేడుకకి చరణ్ తో పాటుగా వెళ్ళలేదు. ఆస్కార్ అవార్డ్స్ వేడుక సమయానికి ఉపాసన భర్తతో జాయిన్ అయ్యింది. ఇద్దరూ కలిసి ఆస్కార్ వేడుకల్లో, అలాగే అక్కడ జరిగిన పార్టీలో పాల్గొని అమెరికా నుండి భార్యా-భర్తలు ఢిల్లీకి వచ్చారు. అక్కడి ఢిల్లీలో రామ్ చరణ్ మీటింగ్స్ తర్వాత ఉపాసనతో కలిసి హైదరాబాద్ కి రాగానే RC15 షూట్ కి వెళ్ళిపోయాడు.
అమెరికాలోనే తన భార్య ఉపాసనకు ఆరోనెల అని రివీల్ చేసాడు చరణ్.. తన బర్త్ డే వేడుకల్లో భార్య ఉపాసన బేబీ బంప్ ని పరిచయం చేసింది. ఇక రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులకు, బాలీవుడ్ లోని కొంతమంది సెలబ్రిటీస్ కి తన బర్త్ డే రోజున గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు. ప్రస్తుతం పార్టీ హడావిడి ముగియడం, RC15 షూటింగ్ కి కొద్దిగా బ్రేక్ దొరకడంతో చరణ్ మరోసారి భార్యతో కలిసి వెకేషన్స్ కి ప్లాన్ చేసుకున్నాడు, ఉపాసన - రామ్ చరణ్ ఇద్దరూ దుబాయ్ వెళ్లేందుకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి రాగానే మీడియా వాళ్ళని ఫొటోస్-వీడియోస్ తీస్తూ సందడి చేసింది.
రామ్ చరణ్-ఉపాసన కలిసి ఎయిర్ పోర్ట్ లో తమ పెట్ రైమా తో సహా కనిపించారు. ప్రస్తుతం చరణ్ ఎయిర్ పోర్ట్ పిక్స్ వైరల్ అయ్యాయి.