Advertisementt

శ్రీరామనవమి స్పెషల్: ఆదిపురుష్ ఆగయా.!

Thu 13th Apr 2023 01:58 PM
adipurush latest update  శ్రీరామనవమి స్పెషల్: ఆదిపురుష్ ఆగయా.!
Adipurush Sri Ramanavam Special Update శ్రీరామనవమి స్పెషల్: ఆదిపురుష్ ఆగయా.!
Advertisement
Ads by CJ

హై బడ్జెట్ ఫిలిం ఇన్ ఇండియా, మచ్ అవైటెడ్ ఫిలిం ఫర్ ప్రభాస్ ఫాన్స్ ఆదిపురుష్ లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. శ్రీరామనవమి ప్రత్యేక కానుకగా ఆదిపురుష్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. మహితోన్నత చరితుడైన మన శ్రీ రామునిగా ప్రభాస్ నటిస్తోన్న ఆదిపురుష్ నుంచి అచ్చంగా అటువంటి చిత్రాన్నే, అందరికీ సుపరిచితమైన హిస్టారికల్ పోస్టర్ నే తీర్చిదిద్ది అందించారు దర్శకుడు ఓం రావత్. సీతా, లక్ష్మణ సమేతుడై సాక్షాత్కరించిన పురుషోత్తముడు శ్రీ రామచంద్రునికి భక్తిపూర్వక విధేయతతో హనుమంతుడు ప్రణమిల్లే అద్భుత దృశ్యాన్నే శ్రీ రామనవమి సందర్భంగా ఆవిష్కరించిన ఆదిపురుష్ టీమ్ ఇకనుంచి ఈ చిత్ర ప్రచారాన్ని వేగవంతం చేయనుంది.

ఫస్ట్ లుక్, టీజర్ విషయంలో విమర్శలు ఎదుర్కున్న ఆదిపురుష్ యూనిట్ నుంచి నేడు వచ్చిన అప్ డేట్, పోస్టర్ చాలావరకూ బెటర్ గానే అనిపించినా హనుమంతుని లుక్ విషయంలో మాత్రం ఇప్పటికీ భక్తజనులు పూర్తిగా సంతృప్తి చెందకపోవచ్చు. చూద్దాం, జూన్ 16 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆదిపురుష్ నుంచి ఇకపై ఎటువంటి ప్రమోషనల్ కంటెంట్ వస్తుందో.. ఏ మేరకు ప్రేక్షకులని ఆకర్షిస్తుందో.! ఈ రామ నవమి రోజుకైతే మాత్రం ఆదిపురుష్ లుక్ ఆకట్టుకున్నట్టే.!

Adipurush Sri Ramanavam Special Update:

Adipurush Special Poster on Sri Ramanavami

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ