త్రిష కొద్దిరోజులుగా ఆకర్షణీయంగా, చాలా అంటే చాలా అందంగా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది. పొన్నియన్ సెల్వన్ లో త్రిష కేరెక్టర్ ఆమె లుక్స్ కి తమిళ తంబీలే కాదు.. సౌత్ ప్రేక్షకులూ ఫిదా అయ్యారు. పొన్నియన్ సెల్వన్ ప్రమోషన్స్ లో త్రిష సారీ లుక్ తో బ్యూటిఫుల్ గా అందరిని ఆకర్షించింది. మాజీ మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ అందాలతో పోటీ పడింది. ఇక పొన్నియన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్ 28 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మార్చ్ 29 ఈరోజు ఈవెనింగ్ చెన్నైలో నిర్వహిస్తున్నారు.
ఈ ఈవెంట్ లో ఐశ్వర్య రాయ్ చుడిదార్ లో హాజరు కాగా.. త్రిష మాత్రం శారీలో తయారై వచ్చింది. త్రిష కాస్త బొద్దిగా కనిపించినా.. బ్లూ సారీ లో అందం మరింతగా ద్విగుణీకృతమైందా అనేలా మెరిసిపోయింది అంటే నమ్మాలి. పొన్నియన్ సెల్వన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చే ముందు ఫొటోలకి ఫోజులిచ్చిన త్రిషని చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. ఐష్ కన్నా త్రిషనే మరింత అందంగా కనిపించింది. అడుగడుగునా ఐశ్వర్య రాయ్ కూడా త్రిష ముందు తేలిపోయిందా అనిపించేలా త్రిష సారీ అవుట్ ఫిట్ కి ఆడియన్స్ తో పాటుగా ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. అక్కడ శోభిత, ఐశ్వర్య మీనన్ ఇలా చాలామంది ఉన్నా అందరి చూపు త్రిష మీదే ఉంది.
ఇక ఐశ్వర్య రాయ్ కాస్త బొద్దుగా ముద్దుగా కనిపించినా.. త్రిష సారీ లుక్ ముందు అందమైన మాజీ మిస్ ఇండియా ఐష్ మాత్రం ఆనలేదనే కామెంట్స్ నెటిజెన్స్ నుంచి వినిపిస్తున్నాయి. ఐష్-త్రిష ఫొటోస్ ని పక్కనబెట్టి.. బెస్ట్ లుక్ ఎవరో చెప్పమని అడుగుతున్నారు. అందులో త్రిషకే ఎక్కువ ఓట్స్ వస్తున్నాయి కూడా. మరి మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 2 లో త్రిషని ఇంకెంత అందంగా ప్రెజెంట్ చేస్తారో చూడాలి.