గెట్ రెడీ ప్రభాస్ ఫాన్స్. ఆదిపురుష్ అప్ డేట్ వచ్చేస్తుంది. ఆదిపురుష్ లో రాముడి దర్శనానికి రెడీగా ఉన్నారా.. అందుకు ముహూర్తం కూడా పెట్టేసారు ఆదిపురుష్ మేకర్స్. నిన్న దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ లు వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకుని.. శ్రీరామనవమి నుండి ఆదిపురుష్ ప్రమోషన్స్ స్టార్ట్ అనే శుభవార్తని ప్రభాస్ ఫాన్స్ కి అందించారు. అసలే ఆదిపురుష్ టీజర్ కి వచ్చిన కామెంట్స్ తో ఢీలాపడిపోయిన ప్రభాస్ ఫాన్స్.. ఆదిపురుష్ నుండి ఇప్పుడు ఎగ్జైటింగ్ అప్ డేట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
ఇక రేపు గురువారం మార్చ్ 30 శ్రీరామనవమి. నవమి రోజు ఉదయమే రాముడి దర్శనం: 7:11AM 🙏 అంటూ ఆదిపురుష్ మేకర్స్ ఇచ్చిన అప్ డేట్ తో ప్రభాస్ ఫాన్స్ సందడి మొదలైపోయింది. ప్రభాస్ రాముడిగా కొత్తగా కనిపిస్తాడంటూ వారు అలెర్ట్ అవుతున్నారు. ఆదిపురుష్ అప్ డేట్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ రచ్చ చెయ్యడానికి రెడీ అయ్యిపోతున్నారు.
మరి ఆదిపురుష్ టీజర్ డిస్పాయింట్మెంట్ నుండి ప్రభాస్ ఫాన్స్ రేపు రాబోయే ఆదిపురుష్ అప్ డేట్ ఫాన్స్ ని ఎంతగా ఇంప్రెస్స్ చెయ్యబోతుందో అని.. అప్పుడే గంటలు, నిమిషాలు లెక్కబెట్టేస్తున్నారు వారు.