పెళ్లయ్యాక సినిమాల్లో నటించడం కష్టం, అసలు ఆఫర్స్ రావడమే కష్టమని చాలామంది హీరోయిన్స్ భయపడిపోతారు. కొంతమంది ధైర్యంగా పెళ్లి చేసుకుని సినిమాలు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లోను, సౌత్ లోను చాలామంది హీరోయిన్స్ పెళ్లి చేసుకున్నాకే క్రేజీ హీరోయిన్స్ గా మారారు. శ్రీయ లాంటి వాళ్ళు పెళ్లి తర్వాత కనుమరుగవుతుండగా.. కాజల్ లాంటి వాళ్ళు బిడ్డని కన్నాక కూడా క్రేజీగా మారుతున్నారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సౌత్ సీనియర్ హీరోలకి కేరాఫ్ గా మారింది. ఇండియన్ 2లో కమల్ హాసన్ తో కలిసి నటిస్తున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు తెలుగులో బాలకృష్ణ సరసన #NBK108 లో నటిస్తుంది.
బాలయ్య సరసన NBK108 లో కాజల్ ట్రెడిషనల్ లుక్ లో కనిపించబోతుంది. అయితే రెండు రోజుల క్రితం కాజల్ అగర్వాల్ గ్లామర్ గా భర్త కిచ్లూతో కలిసి రామ్ చరణ్ బర్త్ డే ఈవెంట్ లో మెరిసిపోయింది. అందాలు ఆరబొయ్యడంలో కాజల్ ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికీ అదే గ్లామర్ మెయింటింగ్ చేస్తుంది. బిడ్డ పుట్టాక ఆరు నెలల గ్యాప్ లో జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ బరువు తగ్గిన కాజల్ గ్లామర్ అవుట్ ఫిట్స్ తో అదరగొడుతుంది.
తాజాగా కాజల్ అగర్వాల్ గ్లామర్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో కాజల్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో అదరగొట్టేస్తుంది. ఇక కాజల్ అగర్వాల్ గ్లామర్ పరంగా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం ఆమె అభిమానులని సంతోషపడేలా చేసింది.