Advertisementt

హీరో రామ్ తో రవితేజ బాక్సాఫీసు ఫైట్

Wed 29th Mar 2023 02:08 PM
boyapatirapo,ravi teja,tiger nageswara rao  హీరో రామ్ తో రవితేజ బాక్సాఫీసు ఫైట్
Ram vs Ravi Teja హీరో రామ్ తో రవితేజ బాక్సాఫీసు ఫైట్
Advertisement
Ads by CJ

2023 దసరా రసవత్తర పోరుకి రంగం సిద్దమవుతుంది. ఇప్పటికే రామ్ పాన్ ఇండియా ఫిల్మ్ అక్టోబర్ 20న దసరా స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా రీసెంట్ గానే డేట్ ప్రకటించగా.. ఇప్పుడు మాస్ రాజా రవితేజ తన పాన్ ఇండియా ఫిల్మ్ ని కూడా అక్టోబర్ 20నే రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా డేట్ ప్రకటించేశాడు.

రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ యేడాది విడుదల కాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ లలో ఇది ఒకటి. 5 ఎకరాల స్థలంలో సినిమా కోసం స్టువర్టుపురం గ్రామాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ బడ్జెట్‌ ను కేటాయించారు మేకర్స్. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని అనౌన్స్ చేశారు. ఈ చిత్రం అక్టోబర్ 20 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల అవుతుంది. దసరా నుంచి టైగర్ నాగేశ్వరరావు బాక్సాఫీస్ వేట ప్రారంభమవుతుంది.. అంటూ అనౌన్స్ చేసారు.

దసరా బిగ్గెస్ట్ సీజన్ తో పాటు పర్వదినం. అయితే అదే రోజు హీరో రామ్-బోయపాటిల #BoyapatiRapo చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ఇది కూడా పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో ఇప్పుడు రవితేజ-రామ్ మధ్యన బాక్సాఫీసు ఫైట్ ఆసక్తికరంగా మారబోతుంది. ఈ రెండు సినిమాలకి లాంగ్ ఫెస్టివల్ హాలిడేస్ కలసిరానున్నాయి. ఇక రవితేజ టైగర్ నాగేశ్వరరావ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో టైగర్ నాగేశ్వరరావు గెటప్‌ లో పొగలు కక్కుతున్న రైలు పై నిలబడి కనిపించారు. 

రామ్ కూడా బోయపాటి చిత్రంలో పవర్ ఫుల్ మాస్ అవతార్ లో కనిపించనున్నట్లుగా #BoyapatiRapo ఫస్ట్ లుక్ తోనే పరిచయం చేసారు. ఇక టైగర్ నాగేశ్వరరావు 1970 ల నేపథ్యంలో స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. ఈ పవర్ ఫుల్ పాత్ర పోషించేందుకు రవితేజ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. 

ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్‌, యాసతో ఆకట్టుకుంటారు. ఈ సినిమాలో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. #BoyapatiRapo లో రామ్ సరసన శ్రీలీల నటిస్తుంది.

Ram vs Ravi Teja :

BoyapatiRapo and Ravi Teja Tiger Nageswara Rao releasing on Oct 20

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ