నందమూరి కళ్యాణ్ రామ్ ఈమధ్యనే అమిగోస్ సినిమా తో సక్సెస్ అందుకుని ప్రస్తుతం డెవిల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గానే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న NTR30 ఓపెనింగ్ లో వన్ అఫ్ ద నిర్మాతగా పాల్గొన్న కళ్యాణ్ రామ్ కి యాక్సిడెంట్ అనే న్యూస్ చూసిన నందమూరి అభిమానులు షాకవుతున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ వైజాగ్ షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొంటున్న సమయంలో ఆయనకి ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది.
ఈ ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కాలి మీద స్కిన్ ఊడిపోయినట్లుగా చెబుతున్నారు. డెవిల్ యాక్షన్ సన్నివేశాల్లో ప్రమాదానికి గురైన కళ్యాణ్ రామ్ కి వెంటనే చిత్ర బృందం ఫస్ట్ ఎయిడ్ చేసి.. వైజాగ్ లోని ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న డెవిల్ చిత్రం యాక్షన్ సీక్వెన్స్ లో కళ్యాణ్ రామ్ గాయపడినట్లుగా వస్తున్న వార్తలతో నందమూరి అభిమానులు ఆందోళన పడుతున్నారు. అయితే కళ్యాణ్ రామ్ కి పెద్ద ప్రమాదమేమీ జరగలేదు.. చిన్న చిన్న గాయాలు మాత్రమే అయినట్లుగా సమాచారం అందుతుంది.