టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా మార్కెట్ లోకి వెళ్ళడానికి తహతహలాడుతుంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ లు మాత్రం పాన్ ఇండియా మీద అస్సలు ఇంట్రెస్ట్ చూపించడమే లేదు. సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రమ్ చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ కి వెళ్లకపోయినా.. రాజమౌళితో చేసే సినిమాతో డైరెక్టమ్ గా పాన్ వరల్డ్ మార్కెట్ సెట్ చెయ్యబోతున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లుతో మూడు లాంగ్వేజెస్ లో వెళతారనుకున్నా అది ఇంతవరకు క్లారిటీ లేదు.
అయితే ఇప్పుడు సుజిత్ తో చెయ్యబోయే OG ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ తో పవన్ కళ్యాణ్ మొదటగా పాన్ ఇండియా మర్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నారనే న్యూస్ పవన్ ఫాన్స్ ని భూమ్మీద నిలవనియ్యడం లేదు. నిర్మాత దానయ్య OG ని పాన్ ఇండియాలోని పలు లాంగ్వేజెస్ లో రిజిస్టర్ చేయించినట్లుగా తెలుస్తుంది. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ టైటిల్ నే దానయ్య తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిజిస్టర్ చేయించినట్లుగా తెలుస్తుంది.
ఇప్పటికే సుజిత్ సాహో తో పాన్ ఇండియా మార్కెట్ లో సత్తా చాటాడు. సుజిత్ సాహో యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో డిజైన్ చేసి అందరిని ఇంప్రెస్స్ చేసాడు. సినిమా ప్లాప్ అయినా.. యాక్షన్ సీన్స్ ని నార్త్ ఆడియన్స్ బాగా ఆదరించడంతో అక్కడ సాహో హిట్ అయ్యింది. దానితో ఇప్పుడు సుజిత్ పవన్ తో పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేసి రంగంలోకి దిగేందుకు.. లోకేషన్స్ వేటలో ఉన్నాడు. ఎక్కువగా ముంబై పరిసర ప్రాంతాలే OG కి బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది.