Advertisementt

మరోసారి తెరపైకి చరణ్-బన్నీ వార్

Wed 29th Mar 2023 09:55 AM
allu arjun,ram charan  మరోసారి తెరపైకి చరణ్-బన్నీ వార్
Allu Arjun vs Ram Charan మరోసారి తెరపైకి చరణ్-బన్నీ వార్
Advertisement
Ads by CJ

మెగా vs అల్లు ఫామిలీస్ ముచ్చట మరోసారి తెరపైకి వచ్చింది. కొంతకాలంగా ఈ ఫామిలీస్ మధ్యన విభేదాలు తలెత్తాయంటూ రకరకాల ప్రశ్నలతో అల్లు అరవింద్, మెగాస్టార్ ని మీడియా ప్రశ్నిస్తూనే ఉంది. అలాంటిదేమి లేదు మేము బాగున్నామని, హీరోల మధ్యన ఆరోగ్యకరమైన పోటీ ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే రామ్ చరణ్-అల్లు అర్జున్ మధ్యన కోల్డ్ వార్ జరుగుతుంది, ఫాన్స్ విషయంలో కూడా మెగా-అల్లు ఫాన్స్ అంటూ విడిపోయారు. అల్లు అర్జున్ కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ మెయింటింగ్ చేస్తూ అల్లు ఆర్మీని ఏర్పాటు చేసుకున్నాడని ఎప్పటినుండో వినిపిస్తున్న టాక్. 

ఇక రీసెంట్ గా వీరిమధ్యన నిజంగానే విభేదాలున్నాయని అనుకునేలా మరో సంఘటన తెరపైకి వచ్చింది. అది రామ్ చరణ్ బర్త్ డే రోజు అల్లు అర్జున్ చరణ్ కి సోషల్ మీడియా ద్వారా కనీసం విషెస్ చెప్పకపోవడం అనేది మెగా ఫాన్స్ కి మింగుడు పడడం లేదు. అటు చూస్తే చరణ్ బర్త్ డే పార్టీలోను అల్లు అర్జున్ కనిపించకపోవడంపై మరోసారి మీడియాలో చరణ్ vs బన్నీ వార్తలు సంచలనంగా మారాయి. అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ తో హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ.. చరణ్ బర్త్ డేలో కనిపించకపోవడం విచిత్రమే. 

కానీ అల్లు ఫాన్స్ బన్నీ హైదరాబాద్ లో లేడు.. ముంబై వెళ్ళాడు అందుకే చరణ్ బర్త్ డే కి అటెండ్ కాలేదని డిఫెండ్ చేసుకుంటున్నారు. దానికి మెగా ఫాన్స్ ఒప్పుకోవడం లేదు.

ఒకవేళ రామ్ చరణ్ ఇంటికి వెళ్లి అల్లు అర్జున్ బర్త్ డే విషెస్ చెప్పినా.. అది ఓ పిక్ రూపంలో షేర్ చేసినట్టయితే ఫాన్స్ కి మీడియాకి ఇన్ని అనుమానాలు వచ్చేవి కావు. బన్నీ అలా చెయ్యలేదు. సోషల్ మీడియాలోనూ చరణ్ ని విష్ చెయ్యలేదు. దానితో వీరిమధ్యన గ్యాప్ రావడం కాదు.. నిజంగానే గొడవలు ఉన్నాయంటూ మరోసారి వీరి రిలేషన్ చర్చనీయాంశం అయ్యింది. మరి చరణ్-బన్నీ మేము బాగున్నాం, మా మధ్యలో ఏమి లేదన్నా.. ఇలాంటి సంఘటనలు మాత్రం వీరి మధ్యన ఏదో ఉంది అనేలా చూపిస్తూనే ఉంటాయి.

Allu Arjun vs Ram Charan :

Allu Arjun Again! No Wishes, No Attendance

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ