Advertisementt

బాలీవుడ్ పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్

Wed 29th Mar 2023 09:32 AM
priyanka chopra,bollywood  బాలీవుడ్ పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్
Priyanka Chopra shocking comments on Bollywood బాలీవుడ్ పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్
Advertisement
Ads by CJ

ప్రియాంక చోప్రా గత కొన్నేళ్లుగా బాలీవుడ్ లో కనిపించడమే లేదు.. అటు అమెరికా వెళ్ళిపోయి హాలీవుడ్ మూవీస్, వెబ్ సీరీస్ ల్లో బాగా బిజీగా మారింది. అయితే హాలీవుడ్ కోసమే ప్రియాంక చోప్రా బాలీవుడ్ ని వదిలేసింది.. భర్త నిక్ జోనస్ తో కలిసి ప్రియాంక అమెరికాలోనే సెటిల్ అయ్యింది అంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. నిక్ జోనస్ తో పెళ్లి తర్వాత ప్రియాంక బాలీవుడ్ మూవీస్ లో కనిపించలేదు. దానితో ఇకపై ఆమె బాలీవుడ్ లో కనిపించదనే ఫిక్స్ అయ్యారు.

అయితే తాజాగా బాలీవుడ్ లో జరిగే రాజకీయాల వలనే తాను బాలీవుడ్ ని వదిలిపెట్టి అమెరికా వెళ్ళిపోయా అంటూ ప్రియాంక చోప్రా బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది నన్ను పక్కకి తోసెయ్యడానికి ప్రయత్నాలు చేసారు, దానికోసం ఒక ముఠానే తయారైంది. అక్కడ రాజకీయాలు జరుగుతున్న విషయమై అర్ధమై.. నేను కొంతమందితో విభేదాలు కొని తెచ్చుకున్నాను, ఇక ఈ పొలిటికల్ గేమ్ ఆడడం నా వల్ల కాదని బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి బిగ్ బ్రేక్ ఇవ్వాలి అనుకున్నాను. 

అలా బాలీవుడ్ ని వదిలేసి.. అమెరికా వెళ్ళిపోయాను. ప్రస్తుతం ఉన్న నా మేనేజర్ అంజులా అప్పట్లో నన్ను ఓ మ్యూజిక్ ఈవెంట్ లో చూసి నీకు మ్యూజిక్ మీద ఇంట్రస్ట్ ఉందా అని అడిగింది. అలా ఓకె చెప్పి అమెరికాలో అడుగుపెట్టాను. అక్కడ ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినా తర్వాత కొత్త అవకాశాలు వచ్చాయి అంటూ తాను అసలు బాలీవుడ్ ని ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పి షాకిచ్చింది. 

Priyanka Chopra shocking comments on Bollywood:

Priyanka Chopra TROLLED for comments on leaving Bollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ