టాప్ హీరోయిన్ సమంత మాయోసైటిస్ వ్యాధి నుండి కోలుకుని ప్రస్తుతం కెరీర్ లో మళ్ళీ షూటింగ్స్, ప్రమోషన్స్, జిమ్ అంటూ రొటీన్ లైఫ్ లోకి వచ్చేసింది. గత ఏడాది ఆల్మోస్ట్ అనారోగ్య కారణాలతోనే సతమతమై ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇంటిపట్టునే ఉన్న సమంత ఈ ఎడాది ఆరంభంలోనే తేరుకుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ తో బిజీ అయిన సమంత నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ శాకుంతలం ఇంటర్వూస్ లో పాల్గొంటుంది. ఈ ఇంటర్వూస్ లో చాలా విషయాలను పంచుకుంటుంది.
ఈ శాకుంతలం ఇంటర్వూస్ లోనే సమంత పారితోషకాలపై చేసిన కామెంట్స్ వైరల్ అవడమే కాదు.. హాట్ హాట్ గా సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. కష్టానికి తగిన ప్రతి ఫలం ఇస్తే బావుంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను చేసే పనిని బట్టి, నా శ్రమని చూసి నీకింత పారితోషకం ఇవ్వాలనుకుంటున్నాం అని నిర్మాతలే చెప్పాలి. కానీ మాకు ఇంత కావాలని మేము చెయ్యి చాచి అడక్కూడదు. నాకు ఇంత ఇవ్వండి అంటూ అడుక్కోవాల్సిన అవసరమూ లేదు.
మనం చేసే పనిని బట్టి ఇది వస్తుంది. కృషిని బట్టి వస్తుంది అని నమ్ముతాను. అందుకే మన శక్తి సామర్ధ్యాలు పెంచుకుంటూ పోవాలి అంటూ సమంత నటుల రెమ్యునరేషన్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.