Advertisementt

NBK108 లో కాజల్ రోల్ రివీల్డ్

Tue 28th Mar 2023 08:28 PM
kajal agarwal,nbk108  NBK108 లో కాజల్ రోల్ రివీల్డ్
Kajal role revealed in NBK108 NBK108 లో కాజల్ రోల్ రివీల్డ్
Advertisement
Ads by CJ

NBK108 లో కాజల్ అగర్వాల్ వన్ అఫ్ ద హీరోయిన్ గా బాలకృష్ణ సరసన నటిస్తుంది. బాలకృష్ణే నడి వయస్కుడిగా 50 ఇయర్స్ కేరెక్టర్ లో కనిపిస్తుంటే.. కాజల్ ఎలా కనిపించబోతుందో అని ఆమె అభిమానులు చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. ఈమధ్యనే కాజల్ నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ఘోస్ట్ తమిళనాట సో సో గా ఆడగా.. తెలుగులో మాత్రం డిజాస్టర్ అయ్యింది. శంకర్-కమల్ హాసన్ ఇండియన్ 2 సెట్స్ నుండి రీసెంట్ గానే బాలకృష్ణ NBK108 సెట్స్ లోకి అడుగుపెట్టింది కాజల్.

NBK108 సెట్స్ నుండి కొన్ని పిక్స్ బయటకి రాగా.. అందులో కాజల్ సారీ లుక్ లో కనిపించింది. అంటే కాజల్ ఈ చిత్రంలో గ్లామర్ రోల్ లో కనిపించదు.. బాలయ్యకి జోడిగా కాస్త ఏజ్డ్ పాత్ర వేస్తుంది అని అందరూ ఫిక్స్ అవుతున్న తరుణంలో కొంతమంది.. NBK108 లో కాజల్ టీచర్ రోల్ పోషిస్తుంది.. అందుకే ఆమెకి కళ్ళజోడు, సారీ ఇవన్నీ ఇచ్చారు.. అంటూ కాజల్ రోల్ రివీల్ చేస్తున్నారు. అసలు ఇందులో నిజమెంతుంతో అనిల్ రావిపూడి క్లారిటీ ఇవ్వాల్సిందే.

ఇక శ్రీలీల మాత్రం చుడీదార్స్ లో ట్రెడిషనల్ గా సింపుల్ గా యంగ్ కేరెక్టర్ ప్లే చేస్తుంది. అయితే శ్రీలీల రోల్ బాలయ్యకి కూతురు కేరెక్టరా లేదంటే వన్ అఫ్ ద హీరోయిన్ రోల్ అనేది తెలియాల్సి ఉంది. కాజల్ నిన్న రాత్రి రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి మోడరన్ డ్రెస్ లో సందడి చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Kajal role revealed in NBK108:

Kajal Agarwal role revealed in NBK108

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ