రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచిన ఆరెంజ్ మూవీ వలన మెగా నటుడు నాగబాబు సూయిసైడ్ చేసుకునే వరకు వెళ్లారనే ప్రచారం అప్పట్లో జరిగింది. నాగబాబు నిర్మించిన ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చెయ్యగా.. చరణ్ కి ఈ చిత్రం బిగ్గెస్ట్ షాక్ ఇవ్వగా.. నిర్మాతగా ఉన్న నాగబాబుని ముంచేసింది. అలాంటి చిత్రాన్ని రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా రీ రిలీజ్ చెయ్యడంపై చాలారకాల అనుమానాలు, చాలారకాల కామెంట్స్ వినిపించాయి. అసలు మగధీరలాంటి బ్లాక్ బస్టర్ ని వదిలేసి.. ఆరెంజ్ రీ రిలీజ్ చెయ్యడమేమిట్రా బాబు అన్నారు.
అయినా కూడా చరణ్ బర్త్ డే స్పెషల్ గా ఆరెంజ్ రీ రిలీజ్ చెయ్యగా.. ఆరెంజ్ రిలీజ్ అయిన థియేటర్స్ మొత్తం మెగా ఫాన్స్ తో నిండిపోయాయి. ఆరెంజ్ థియేటర్స్ లో చరణ్ బర్త్ డే కి ముందురోజు 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ కనిపించింది. దానితో ఇప్పుడు అందరిలో ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్ పై ఆత్రుత పెరిగిపోయింది. తాజాగా నాగబాబు ఆరెంజ్ కలెక్షన్స్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. యావరేజ్ మూవీ రీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో అనుకున్నాము. ఫాన్స్ ఎప్పటినుండో అడుగుతున్నారు. కానీ ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తర్వాత ఆరెంజ్ రీ రిలీజ్ చెయ్యడం కలిసొచ్చింది. అదే సమయంలో అరవింద్ గారు మగధీరని రీ రిలీజ్ చేస్తున్నారని తెలిసింది.
కానీ నేను జనసేన పార్టీకి నా వంతు సహాయం చెయ్యడానికి అని అరవింద్ గారిని ఆరెంజ్ రీ రిలీజ్ గురించి అడిగాను, ఆయన ఓకె అని మగధీరని ఆపి.. ఆరెంజ్ రిలీజ్ చెయ్యడానికి సహకరించారు. ఆరెంజ్ రిలీజ్ అయ్యాక దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి మాకు మతిపోయింది. అప్పటి జనరేషన్ కి ఆరెంజ్ ఎక్కలేదు. కానీ ఇప్పటి జనరేషన్ కి ఆరెంజ్ బాగా నచ్చింది. రీచ్ అయ్యింది. ఓ పెద్ద సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఇప్పుడు ఆరెంజ్ రీ రిలీజ్ కి రావడం నిజంగా హ్యాపీగా ఉంది. చరణ్ బాబుకి నా వల్ల 2010 లో ఓ మైనస్ అయ్యింది అన్న ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు చరణ్ బాబు బర్త్ డే కి ఆరెంజ్ హిట్ ఇచ్చి అది చరణ్ కి ఇచ్చే గిఫ్ట్ గా ఫీలవుతున్నాను.
నేను అప్పట్లో సక్సెస్ ఫుల్ సినిమాని ఇవ్వకపోయినా.. ఈరోజు ఇవ్వగలిగాను, చరణ్ కెరీర్ లో నావల్ల హిట్ మిస్ అయ్యింది అనే గాయం.. ఇప్పుడు ఆరెంజ్ సక్సెస్ ఇచ్చినందుకు తీరింది.. అంటూ నాగబాబు ఓ వీడియో ని రిలీజ్ చేసారు. ఇక ఆరెంజ్ రీ రిలీజ్ తో వచ్చిన కలెక్షన్స్ జనసేన పార్టీకి ఇవ్వగలుగుతున్న అంటే అది నీవల్లే సాధ్యం అయ్యింది థాంక్యూ చరణ్ అంటూ నాగబాబు చరణ్ కి థాంక్యూ చెప్పారు.