నందమూరి బాలకృష్ణ ఈమధ్యన అభిమానులని అడుగడునా ఇంప్రెస్స్ చెయ్యడమే కాదు.. మిగతా హీరోల అభిమానులకి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. లుక్స్ వైజ్ గా, స్టయిల్ విషయంలో అన్నిటిలో బాలయ్య కొత్త లుక్ లో కనిపిస్తూ అందరిలో ఆసక్తిని కలిగిస్తున్నారు. అంతేకాదు.. సినిమాలు, రాజకీయాలేనా.. అంటూ ఇప్పుడు డిజిటల్ మీడియాలో బాలయ్య తన సరికొత్త స్టయిల్ ని ప్రేక్షకులకి చూపిస్తున్నారు. IPL కామంటేటర్ గా ఇప్పుడు మరో అవతారమెత్తారు.
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో #NBK108 చిత్రం చేస్తున్న బాలకృష్ణ అందులో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. అంటే సాల్ట్ అండ్ పెప్పెర్ లుక్ అన్నమాట. ఒకే కేరెక్టర్ లో మూడు రకాల వేరియేషన్స్ చూపించబోతున్న బాలయ్య లుక్స్ లో రెండు లుక్స్ ఉగాది స్పెషల్ గా అనిల్ రావిపూడి వదిలారు. రెండు పిక్స్ వేర్వేరు స్టయిల్స్ లో కనిపించగా.. నందమూరి అభిమానులు మాత్రం ఫుల్ గా సర్ ప్రైజ్ అయ్యారు. తాజాగా NBK108 సెట్స్ నుండి మరో లుక్ బయటికి వచ్చింది. బాలయ్య మెడలో మఫ్లర్ వేసుకుని 50 ఇయర్స్ వ్యక్తిగా ఎనేర్జిటిక్ గా నవ్వుతూ కనిపించారు.
ఆ ఏజ్ లోను స్టయిల్ గా బాలయ్య కనిపించగా.. కాజల్ మాత్రం సారీ లుక్ లో దర్శనమిచ్చింది. శ్రీలీల కూడా అదే పిక్ లో ఉండగా.. రీసెంట్ గా MLC ఎలక్షన్స్ లో గెల్చిన టిడిపి అభ్యర్థి బాలయ్యని కలిసినప్పుడు దిగిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.