Advertisementt

టైటిల్ పై అసంతృప్తిలో మెగా ఫాన్స్

Tue 28th Mar 2023 10:40 AM
ram charan,game changer title  టైటిల్ పై అసంతృప్తిలో మెగా ఫాన్స్
Mega fans are unhappy with the RC15 title టైటిల్ పై అసంతృప్తిలో మెగా ఫాన్స్
Advertisement
Ads by CJ

గత ఏడాది నుండి రామ్ చరణ్ కొత్త పాన్ ఇండియా చిత్రం RC15 టైటిల్ పై రకరకాల ప్రచారాలు జరిగాయి. సర్కారోడు, సీఈఓ అంటూ RC15 కి పెట్టబోయే టైటిల్ విషయంలో జరిగిన ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ నిన్న రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా మెగా ఫాన్స్ కి RC15 టైటిల్ తో ముందుగా సర్ ప్రైజ్ ఇచ్చారు శంకర్ అండ్ దిల్ రాజులు. RC15 టైటిల్ గా గేమ్ ఛేంజర్ అంటూ టైటిల్ ని రివీల్ చెయ్యడంతో చాలామంది ఈ టైటిల్ ఏమిటి అని ఆశ్చర్యపోయారు. ఆల్మోస్ట్ సీఈఓ టైటిల్ కన్ ఫర్మ్ అనుకున్న తరుణంలో ఇలా గేమ్ ఛేంజర్ టైటిల్ బయటికి రావడం మెగా ఫాన్స్ కి షాకిచ్చింది.

చాలామంది చరణ్ ఫాన్స్ గేమ్ ఛేంజర్ టైటిల్ మాములుగా ఉంది, అంత ఇంప్రెసివ్ గా లేదు అంటూ పెదవి విరుస్తున్నారు. గేమ్‌ చేంజర్ అనే టైటిల్ ఇంగ్లీష్ లో ఉండటం వల్ల క్యాచీగా లేదనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మూడు లాంగ్వేజెస్ కి సరిపోయే టైటిల్ పెట్టారు ఓకె.. ఇంకాస్త పవర్ ఫుల్ టైటిల్ పెడితే బావుంటుంది.. నాకైతే ఈ గేమ్ ఛేంజర్ టైటిల్ అంతగా నచ్చలేదు అంటూ ఓ మెగా ఫాన్స్ చెబుతున్న మాట. రామ్ చరణ్ లుక్ లో ఉన్నంత ఇంటెన్సిటీ టైటిల్ లో లేదు అంటూ చాలామంది మెగా ఫాన్స్ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. 

గేమ్ ఛేంజర్ అని స్టోరీకి రిలేటెడ్ గా పెట్టి ఉంటారేమో అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. విలన్ సూర్య సీఎం గా కనిపిస్తాడు. ఎస్ జె సూర్యని ఎదుర్కునే క్రమంలో రామ్ చరణ్ పొలిటికల్ పార్టీ పెట్టి.. అధికారాన్ని మార్చే కీ రోల్ ప్లే చేయడంతోనే శంకర్ ఈ టైటిల్ పెట్టి ఉండొచ్చేమో అంటున్నారు. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ టైటిల్ పై రకరకాల కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mega fans are unhappy with the RC15 title:

Ram Charan Fans Unhappy With Game Changer Title

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ