Advertisementt

ఈ వారం రిలీజ్ కాబోయే సినిమాలివే

Tue 28th Mar 2023 10:19 AM
ott  ఈ వారం రిలీజ్ కాబోయే సినిమాలివే
New OTT releases this week ఈ వారం రిలీజ్ కాబోయే సినిమాలివే
Advertisement
Ads by CJ

ప్రతి వారం సినిమాలు థియేటర్స్ లో, ఓటిటీలలో రిలీజ్ అవుతుంటాయి. థియేటర్స్ లోకి  వస్తుంటాయి.. పోతుంటాయి.. ఇక ఓటిటీలలో కూడా వారం వారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అయితే గత రెండు నెలలుగా చిన్న సినిమాలు మాత్రమే బాక్సాఫీసు వద్దకు వస్తున్నాయి. పెద్ద సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలేవీ హంగామా చెయ్యకపోవడంతో ప్రస్తుతం చిన్న సినిమాల హవా కొనసాగుతుంది. రేపు శ్రీరామ నవమి మార్చి 30న విడుదల కాబోయే దసరా తోనే మళ్ళీ పెద్ద సినిమాల హడావిడి మొదలు కాబోతుంది. ఇక వారం వారం ఓటిటీలలోకి డైరెక్ట్ గా రిలీజ్ అయ్యే సినిమాలు, థియేటర్స్ లో హిట్ అయిన సినిమాలు, చిన్న సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి.

ఈవారం ఏయే ఓటిటిలలోకి ఏయే సినిమాల విడుదల కాబోతున్నాయో లిస్ట్ చూసేద్దాం

డిస్నీ ప్లస్ హాట్ స్టార్: సంతోష్ శోభన్ నటించిన శ్రీదేవి శోభన్ బాబు, మార్చి 30న స్ట్రీమింగ్. 

ఆహా: సత్తిగాని రెండు ఎకరాలు వెబ్ మూవీ, ఏప్రిల్ 1న స్ట్రీమింగ్.

సన్ నెక్ట్స్: ప్రభుదేవా నటించిన భగీరా, మార్చి 31న రిలీజ్

నెట్ ఫ్లిక్స్: విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఆల్ మోస్ట్ ప్యార్ విత్ డీజే మోహబ్బత్ హిందీ,  మార్చి 31న స్ట్రీమింగ్.

జీ 5: జయం రవి హీరోగా నటించిన అగిలన్ (తమిళ్),మార్చి 31న రిలీజ్ దానితో పాటుగా శివ కుమార్ నటించిన అయోతి (తమిళ్).. మార్టి 31న విడుదల కాబోతున్నాయి. వీటితో పాటుగా ఇంట్రెస్ట్ ని, ఉత్సుకతని, క్యూరియాసిటీని కలిగించే పలు వెబ్ సీరీస్ లు అందుబాటులోకి రానున్నాయి.

New OTT releases this week:

March 30th 2023 Week 4 OTT movies

Tags:   OTT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ