రామ్ చరణ్ మెగాస్టార్ కొడుకుగానే సినిమా ఇండస్ట్రీకి లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ గ్రాండ్ గా రామ్ చరణ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసాడు. ఆ సినిమా చూసాక అసలు రామ్ చరణ్ హీరోగా ఏం పనికొస్తాడు.. తండ్రి అండతో ఎమన్నా హీరోగా ఎదుగుతాడేమో అనుకోవడమే కాదు అన్నారు కూడా. కానీ రెండో సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టేసాడు. రాజమౌళి రామ్ చరణ్ ని రెండో సినిమాకే స్టార్ హీరోని చేసాడు. అయినప్పటికీ చాలామంది రామ్ చరణ్ అందం విషయంలో పెదవి విరుస్తూనే ఉన్నారు.
ఆ తర్వాత ఆరెంజ్ ప్లాప్ తో ఇంకేమిటి రామ్ చరణ్ పనైపోయింది అన్నారు. అలా విమర్శలు అందుకున్న ప్రతిసారి రామ్ చరణ్ తనని తాను కొత్తగా మలుచుకున్నాడు. కానీ అందరిలో వీడేం హీరో అన్న భావనని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన ధ్రువ ఒక్కసారిగా మార్చేసింది. రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్, రామ్ చరణ్ స్టయిల్, చరణ్ పెరఫార్మెన్స్ చూసి చరణ్ ని మెగాస్టార్ కొడుకు అనకుండా మెగా పవర్ స్టార్ అనడం మొదలు పెట్టారు. ఆ తర్వాత నాయక్, రచ్చ.. ఇలా యావరేజ్ సినిమాలు చేసినా.. వినయ విధేయరామ లాంటి బిగ్గెస్ట్ డిసాస్టర్ వచ్చినా.. ఆర్.ఆర్.ఆర్ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు.
ఆర్.ఆర్.ఆర్ లో రామరాజుగా ఆయన చూపించిన వీరత్వం, మరో హీరో ఎన్టీఆర్ తో ఉన్న ఎమోషనల్ ఫైట్, అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన పెరఫార్మెన్స్, నాటు నాటు లో ఎన్టీఆర్ తో కలిపి కుమ్మేసిన డాన్స్ స్టెప్స్, యాక్షన్ సన్నివేశాల్లో చూపించిన నటన, సిక్స్ ప్యాక్ బాడీ.. అల్లూరి గెటప్ లో చరణ్ లుక్స్ అన్నీ మెగా ఫాన్స్ నే కాదు.. ఆల్ ఇండియా ఆడియన్స్ ని, వరల్డ్ వైడ్ ప్రేక్షకులని బాగా ఇంప్రెస్స్ చేసాయి. అమెరికాలో ఆర్.ఆర్.ఆర్ గోల్డెన్ గ్లొబ్ అందుకున్న క్షణం నుండి హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్, అలాగే అన్నిటికిమించి ఆస్కార్ అందుకున్నప్పుడు రామ్ చరణ్ స్టయిల్, నడవడిక అన్ని చరణ్ ని ఉన్నత స్థానంలో నిలబెట్టాయి.
ఈ ఏడాది రామ్ చరణ్ ఇంత గొప్ప కీర్తి ప్రతిష్టలతో పాటుగా తండ్రి అయ్యే మధుర క్షణాలను ఆస్వాదించడానికి రెడీగా ఉన్నాడు. గతంలో వీడు హీరో ఏంటి రా బాబు అన్న వాళ్లే ఇప్పుడు చరణ్ పై పూల వర్షం కురిపిస్తున్నారు. అటు పర్సనల్ గా.. ఇటు కెరీర్ పరంగా రామ్ చరణ్ ఈ బర్త్ డే వెరీ వెరీ స్పెషల్ అనే చెప్పాలి. ఈ రోజు చరణ్ పుట్టిన రోజు సందర్భంగా శంకర్ తో నటిస్తున్న RC15 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ వదలబోతున్నారు. ఇప్పటికే గేమ్ ఛేంజెర్ అంటూ పాన్ ఇండియా టైటిల్ తో వచ్చేసిన చరణ్ గేమ్ ఛేంజెర్ లుక్ కోసం మెగా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.
నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సినీజోష్ టీమ్ తరపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.