Advertisementt

క్రేజ్ ఉంది: సెకండ్ హీరోయిన్ గా అవసరమా?

Sun 26th Mar 2023 08:15 PM
sreeleela,ssmb28  క్రేజ్ ఉంది: సెకండ్ హీరోయిన్ గా అవసరమా?
There is a craze: Is it necessary as a second heroine? క్రేజ్ ఉంది: సెకండ్ హీరోయిన్ గా అవసరమా?
Advertisement
Ads by CJ

ప్రెజెంట్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ కి కూడా లేని క్రేజ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకి ఉంది. ఆమె నటించిన రెండే చిత్రాలతో స్టార్ హీరోల సినిమాల్లో క్రేజీ ఆఫర్స్ పట్టెయ్యడమే కాదు.. యంగ్ హీరోలను ఆల్మోస్ట్ బుట్టలో పనిలో ఉంది. శ్రీలీల చేతిలో ఏకంగా ఎనిమిది ప్రాజెక్ట్స్ అంటే పాప క్రేజ్, పాపులారిటీ ఎంతగా ఉన్నాయో అర్ధమవుతుంది. అంతగా శ్రీలీల పేరు టాలీవుడ్ లో మోగిపోతుంది. 

అంత క్రేజ్ ఉన్న శ్రీలీల ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వస్తే మాత్రం సెకండ్ హీరోయిన్ పాత్రలు చెయ్యడం అవసరమా అనేది ఆమె అభిమానుల భావన. చక్కగా నితిన్, వరుణ్ తేజ్, రామ్, వైష్ణవ తేజ్ సినిమాల్లో తానేమిటో నిరూపించుకుంటే ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, మహేష్, బన్ని సినిమాల్లో ఆఫర్స్ వాటంతట అవే వస్తాయి. అసలు వాళ్లే వెంటపడి సినిమాల్లో అవకాశం ఇస్తారు. కానీ ఇప్పుడు మహేష్ తో SSMB28 లో సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది. ఇందులో పూజా హెగ్డే మెయిన్ లీడ్ లో కనిపించబోతుంది.

ఏదో SSMB28 నిర్మాత నాగ వంశీ శ్రీలీలని సెకండ్ హీరోయిన్ అనొద్దు.. ఆమె కూడా మెయిన్ అంటే మాత్రం ఆమె కేరెక్టర్ మారిపోదు కదా అని ఫాన్స్ తెగ ఫీలైపోతున్నారు. ఇక బాలయ్య NBK108  లోను కాజల్ మెయిన్ హీరోయిన్. శ్రీలీల మరో హీరోయిన్.. అంటే అక్కడా సెకండ్ కేరెక్టర్ చేసుకోవాల్సిందే. మంచి అందం, మంచి డాన్స్, టాలెంట్ ఉన్న అమ్మాయి ఇలా సెకండ్ హీరోయిన్ గా నటించడం ఆమె అభిమానులకి మాత్రం సుతరామూ నచ్చడం లేదు.

There is a craze: Is it necessary as a second heroine?:

 Is it necessary to make Sreeleela as the second heroine?

Tags:   SREELEELA, SSMB28
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ