Advertisementt

పవన్ కి విలన్ గా చెయ్యమని బ్రతిమాలారంట

Sun 26th Mar 2023 06:03 PM
minster malla reddy,pawan movie  పవన్ కి విలన్ గా చెయ్యమని బ్రతిమాలారంట
Minister Malla Reddy Says No to Villain Role in Pawan Movie పవన్ కి విలన్ గా చెయ్యమని బ్రతిమాలారంట
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా నటించడానికి తెలంగాణ మంత్రిని పవన్ తో సినిమా చెయ్యబోయే ఓ సినిమా దర్శకుడు గంట సేపు బ్రతిమిలాడడంట. మరి ఆ మినిస్టర్ ఎవరో అని తెగ ఆలోచించెయ్యకండి.. తెలంగాణ కాంట్రవర్సీ మినిస్టర్ మల్లారెడ్డి. పొలిటిషన్, బిజినెస్ మ్యాన్, విద్యా సంస్థల అధిపతి మల్లారెడ్డి గారిని పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో విలన్ గా నటించమని దర్శకుడు హరీష్ శంకర్ ఓ గంటసేపు బ్రతిమాలినట్లుగా మల్లారెడ్డే స్వయంగా చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. 

ఈరోజు మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా మేమ్ ఫెమస్ టీజర్ లాంచ్ జరగగా.. ఆ కార్యక్రమంలో ఆ మూవీ యూనిట్ గురించి మాట్లాడుతూ మల్లారెడ్డి తనని పవన్ సినిమాలో విలన్ గా చెయ్యమని హరీష్ శంకర్ తన ఇంటికి వచ్చి గంట బ్రతిమిలాడాడని, కానీ నేను చెయ్యను అని చెప్పి ఆయన్ని పంపించేసాను అంటూ మల్లారెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 

అలాగే మేమ్ ఫెమస్ హీరో నేచురల్ గా ఉన్నాడని, ప్రభాస్ కంటే కూడా స్మార్ట్ ఉన్నాడని, నేను రియల్ గా చెబుతున్నా.. ప్రభాస్ కూడా బోలెడంత మేకప్ వేసుకుంటాడు కానీ.. నువ్వు నేచురల్ గా విత్ అవుట్ మేకప్ లో ఎంత స్మార్ట్ ఉన్నాడు, నీ కటౌట్ సూపర్, తెలంగాణ బిడ్డని ఎంకరేజ్ చెయ్యాలి అంటూ ప్రభాస్ ఫాన్స్ కి కోపం తెప్పించారు సదరు మంత్రి గారు. మరి ఎప్పుడూ న్యూస్ లో ఉండాలని ముచ్చటపడే మంత్రి మల్లారెడ్డి మరోసారి ఇలా పవన్ సినిమా గురించి మాట్లాడి హాట్ టాపిక్ గా నిలిచారు.

Minister Malla Reddy Says No to Villain Role in Pawan Movie:

Minister Malla Reddy says he denied the main villain role in Pawan movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ