Advertisementt

కొత్తగా కనబడుతున్న బాలయ్య

Sun 26th Mar 2023 04:28 PM
nandamuri balakrishna  కొత్తగా కనబడుతున్న బాలయ్య
NBK TEAMS UP WITH STAR SPORTS TELUGU కొత్తగా కనబడుతున్న బాలయ్య
Advertisement
Ads by CJ

ఇప్పుడు ఎక్కడ చూసినా బాలయ్యే కనిపిస్తున్నారు. ఒకప్పుడు పాలిటిక్స్, సినిమాలు చేసే బాలయ్య బాబు ఇప్పుడు బుల్లితెర మీద, ఓటిటి టాక్ షోస్ తో ఫాన్స్ కి అడుగడుగునా కిక్ ఇస్తున్నారు. ఆహా ఓటిటి కోసం అన్ స్టాపబుల్ ని అద్భుతమైన రీతిలో నడిపించిన బాలకృష్ణ అదే ఓటిటి ఇండియన్ ఐడల్ కోసం మెంటర్ గా మారారు. NBK108 షూటింగ్ తోనూ దూసుకుపోతున్న ఆయన ఐపీల్ లో ఇప్పుడు వేణుగోపాల్ రావు, MSK ప్ర‌సాద్‌తో పాటు కామెంట‌రీ బాక్స్‌ను షేర్ చేసుకోబోతున్నారు.

బాలకృష్ణ త‌న అస‌మాన శైలితో ఆట‌పై క్రీడాభిమానుల దృక్ప‌థానికి త‌గిన‌ట్లుగా ఉత్సాహ‌భ‌రితంగా కామెంట‌రీ అందించ‌నున్నారు. అంతేకాదు..#AskStar ద్వారా అభిమానులు తొలిసారిగా నేరుగా TV లైవ్‌లో పాల్గొనే గొప్ప అవ‌కాశం అందిస్తున్నాం. ఇండియాలో అత్య‌ధికంగా విక్షిస్తున్న క్రికెట్ షో - క్రికెట్ లైవ్‌లో కూడా బాల‌కృష్ణ‌గారు క‌నిపించ‌బోతున్నారు.

స్టార్‌స్పోర్ట్స్ తెలుగుతో అసొసియేట్ అవ‌టంపై నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ లీడింగ్ స్పోర్ట్స్‌ బ్రాడ్‌కాస్ట‌ర్‌లో భాగ‌మైన‌ స్టార్ స్పోర్ట్స్ తెలుగుతో అసొసియేట్‌ అవుతున్నందుకు ఓ క్రికెట్ అభిమానిగా సంతోషిస్తున్నాను. కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తో క‌లిసి బిగ్ స్క్రీన్‌పై IPL చూస్తూ సంతోషంగా గ‌డిపిన క్ష‌ణాలు ఎన్నో ఉన్నాయి. ఇక తెలుగు అభిమానులు న‌న్ను స్టార్ స్పోర్ట్స్‌లో చూడొచ్చు. మార్చ్ 31న‌ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఎక్స్‌పర్ట్స్‌తో జాయిన్ కాబోతున్నా. ఆ క్ష‌ణం కోసం నేను ఎగ్జైట్‌గా ఎదురుచూస్తున్నా. మ‌న క్రికెట్ స్టార్స్ అందిరికీ నేను మ‌ద్ద‌తు ఇస్తున్నాను, అలాగే ఈ సీజ‌న్ మ‌నంద‌రికీ ప్ర‌త్యేకంగా నిలిచిపోవాల‌ని ఆశిస్తున్నాను అన్నారు.

మరి ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలతో బాలయ్య సీనియర్ హీరోలైన చిరు, నాగ్ వెంకిలకి పోటీ ఇవ్వడం కాదు.. ఈ మధ్యన చాలా విషయాల్లో బాలయ్య కొత్తగా కనిపిస్తున్నారు. లుక్స్, స్టయిల్ విషయంలో టాప్ లో బాలయ్య ఉన్నారంటూ నందమూరి ఫాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. మా బాలయ్య ఎందులోనూ తగ్గరు అంటూ పండగ చేసుకుంటున్నారు.

NBK TEAMS UP WITH STAR SPORTS TELUGU:

NANDAMURI BALAKRISHNA TEAMS UP WITH STAR SPORTS TELUGU

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ