Advertisementt

నాగ చైతన్య కొత్తింటి ఖరీదు వింటే షాకే..

Sun 26th Mar 2023 04:04 PM
naga chaitanya  నాగ చైతన్య కొత్తింటి ఖరీదు వింటే షాకే..
Price of Naga Chaitanya new property in Jubilee Hill నాగ చైతన్య కొత్తింటి ఖరీదు వింటే షాకే..
Advertisement
Ads by CJ

నాగ చైతన్య సమంతని పెళ్లి చేసుకున్నాక మురళి మోహన్ ఇల్లు కొని ఆ ఇంట్లో కొత్త కాపురం పెట్టారు. తర్వాత సమంతతో కలిసి ఉన్నప్పుడే నాగ చైతన్య తండ్రి నాగార్జున ఇంటి దగ్గరలోనే స్థలం కొని కొత్తింటి నిర్మాణం ప్రారంభించాడు. అయితే ఏడాదిన్నర క్రితం సమంత తో విడాకులు తీసుకున్న నాగ చైతన్య  కొన్నాళ్ళు హోటల్ లో మరికొన్నాళ్లు తండ్రి నాగార్జున దగ్గరే ఉండిపోయాడు. అయితే సమంతతో విడిపోయాక మురళి మోహన్ దగ్గర కొన్న ఇల్లు కూడా అమ్మేసిన నాగ చైతన్య తన కలలకు అనుగుణంగా హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతం జూబ్లీ హిల్స్ లో ఇంటి నిర్మాణం చేపట్టాడు.

రీసెంట్ గానే సకల సదుపాయాలతో పూర్తయిన ఆ కొత్తింట్లోకి నాగ చైతన్య గృహ ప్రవేశం చేసాడు. స్విమ్మింగ్ పూల్, జిమ్ తదితర సౌకర్యాలతో తాను ఇష్టపడి కట్టుకున్న ఇంటి ఖర్చుపై ఇప్పుడు అందరిలో ఆసక్తి మొదలైంది. నాగ చైతన్య కొత్తింటి ఫొటోస్ సోషల్ మీడియాలో కనిపించడంతో అతని ఇంటి ఖరీదుపై అందరూ ఆరాలు మొదలు పెట్టారు. 

లగ్జరీగా కట్టించుకున్న చైతూ కొత్తింటి ఖరీదు 15 కోట్లు విలువ చేస్తుంది అని లెక్కలేస్తున్నారు నెటిజెన్స్. మరి సమంతతో కలిసి ఉన్నప్పుడే చైతూ ఈ ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టినా.. ఆమెతో విడిపోయాకే గృహ ప్రవేశం చేసాడు.

Price of Naga Chaitanya new property in Jubilee Hill:

The value of Naga Chaitanya new house is 15 cr

Tags:   NAGA CHAITANYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ